Tammineni Sitaram: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర గురించి స్పందిస్తూ మీడియాపై తమ్మినేని ఫైర్..

ABN , First Publish Date - 2023-05-21T11:46:04+05:30 IST

మీడియా ప్రతినిధులపై (Media representatives) శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం (AP speaker Tammineni Sitaram) చిందులు తొక్కారు.

Tammineni Sitaram: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర గురించి స్పందిస్తూ మీడియాపై తమ్మినేని ఫైర్..

నంద్యాల: మీడియా ప్రతినిధులపై (Media representatives) శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం (AP speaker Tammineni Sitaram) చిందులు తొక్కారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP Avinash Reddy) పాత్రపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుందని, తమకు, తనకు పనేంటి అంటూ మీడియాపై స్పీకర్ తమ్మినేని సీతారాం చిర్రుబుర్రులాడారు. వివేకా కేసులో అవినాష్ పాత్ర ఉంటే సీబీఐ తేలుస్తుందని, మీడియాకు చెప్పాలా?.. తమరేమైనా సీబీఐ చీఫ్వా? అంటూ మీడియా ప్రతినిధులపై స్పీకర్ మండిపడ్డారు. శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించిన కవరేజ్‌కు వెళ్లిన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) ప్రతినిధులపై అవినాష్ అనుచరుల దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు (AP BJP Chief Somuveerraju) మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని బీజేపీ ఖండిస్తోందన్నారు. అవినాష్ రెడ్డి అనుచరుల దాష్టీకాన్ని అందరూ అడ్డుకోవాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పెద్దలు ఛానల్ ప్రతినిధులకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. వార్తలు రాస్తే దాడులు‌ చేయించడం సమంజసం కాదని అన్నారు.

Updated Date - 2023-05-21T12:12:14+05:30 IST