Share News

భద్రత ఏది?

ABN , Publish Date - Apr 02 , 2025 | 01:23 AM

గిరిజన విద్యాలయాల్లో బాలికలకు భద్రత కరువైంది. బాలికల పాఠశాలల్లో కచ్చితంగా మహిళా బోధకులు, మహిళా సిబ్బంది మాత్ర మే ఉండాలన్న నిబంధనలకు భిన్నంగా రంప చోడవరం మన్యంలోని రెండు ఐటీడీఏల పరి ధిలో పురుష బోధకులను కొనసాగిస్తుండటంతో గిరిజన బాలికల భద్రత ప్రశ్నార్థకంగా

భద్రత ఏది?

గిరిజన విద్యాలయాల్లో బాలికలకు సంరక్షణ కరువు

బాలికల పాఠశాలల్లో మహిళా బోధకులే

ఉండాలన్న నిబంధనకు ఐటీడీఏల తూట్లు

అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా దాచిపెడుతున్న వైనం

అడ్డతీగలలో బాలికల విద్యాలయంలోనే బస చేస్తున్న పురుష సంక్షేమాధికారి

(రంపచోడవరం/అడ్డతీగల-ఆంధ్రజ్యోతి)

గిరిజన విద్యాలయాల్లో బాలికలకు భద్రత కరువైంది. బాలికల పాఠశాలల్లో కచ్చితంగా మహిళా బోధకులు, మహిళా సిబ్బంది మాత్ర మే ఉండాలన్న నిబంధనలకు భిన్నంగా రంప చోడవరం మన్యంలోని రెండు ఐటీడీఏల పరి ధిలో పురుష బోధకులను కొనసాగిస్తుండటంతో గిరిజన బాలికల భద్రత ప్రశ్నార్థకంగా మారిం ది. తరచుగా గిరిజన బాలికలపై లైంగిక వేధిం పులు చోటుచేసుకున్న విద్యాలయాలన్నీ పురుష ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులూ ఉన్నవే.

రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో 35 గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో కేవలం 7 పాఠశాలలు మాత్రమే పూర్తిగా మహిళా ప్రధా నోపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి. పురుష ప్రధానోపాధ్యాయులు, పురుష ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లోనే బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఐటీడీఏ, గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులు ఈ లోపాలను సరిదిద్దేందుకు, వాటిని పునరావృతం కాకుండా చూసేందుకు ఎటువంటి చర్యలను చేపట్టడం లేదు. తాజాగా అడ్డతీగల మండలంలో ఓ పాఠశాలలో ఓ ఘట నపై వదంతులు వచ్చాయి. అందుకు సంబం ధించి వైద్య పరీక్షలు కూడా జరిగాయి. ఇదిలా ఉండగా ఆ విద్యాలయంలోనే ఓ గిరిజన సంక్షే మ పురుష అధికారి బస చేస్తుండటం కూడా వివాదంగా మారింది. బాలికల విద్యాలయంలోనే నిబంధనలకు విరుద్ధంగా బస చేస్తుండటాన్ని ఎవరూ అడ్డుచెప్పడంలేదు. ఇకనైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపడితేనే గిరిజన సంక్షేమానికి సార్థకత.

Updated Date - Apr 02 , 2025 | 01:23 AM