Kakani: అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్

ABN , First Publish Date - 2023-02-03T15:00:43+05:30 IST

ఫోన్ ట్యాపింగ్, పార్టీ మార్పు అంశాలపై ఎమ్మెల్యే కోటింరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Kakani: అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్

నెల్లూరు: ఫోన్ ట్యాపింగ్, పార్టీ మార్పు అంశాలపై ఎమ్మెల్యే కోటింరెడ్డి శ్రీధర్‌రెడ్డి (KotamReddy SridharReddy) చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani GoverdhanReddy) కౌంటర్ ఇచ్చారు. 2014 ఎన్నికల సమయంలో రూరల్‌లో ఎమ్మెల్యే టిక్కెట్‌కు ఎంత పోటీ ఉందనేది కోటంరెడ్డికి తెలుసని... ఆనాడు జగన్ (AP CM Jaganmohan Reddy) స్థానంలో ఎవరున్నా కోటంరెడ్డికి సీటు దక్కేదికాదన్నారు. పార్టీ మారాలనేది కోటంరెడ్డి వ్యక్తిగత విషయమని... కానీ వైసీపీ (YCP)పై బురద జల్లడం సరికాదని అన్నారు. అక్కడ జరిగింది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదు.. మ్యాన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నారు. కోటంరెడ్డిని చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ట్యాప్‌ చేశారని విమర్శించారు. ఒకవేళ నిజంగా ట్యాపింగ్‌ జరిగి ఉంటే.. అవమానం, అనుమానం అనే బదులు విచారణకి ముందుకు వెళ్లొచ్చు కదా? ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై ఇన్నిరోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదని మంత్రి ప్రశ్నించారు.

కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు... ఏమైందని నిలదీశారు. అది ఆడియో రికార్డ్‌ అని తెలుసు కాబట్టే అవమానించారని డ్రామాలు ఆడుతున్నావని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాతే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ‘‘కోటంరెడ్డి నువ్వు జగన్‌ (AP CM)కు వీరవిధేయుడివి కాదు. వేరే వాళ్లకు విధేయుడివి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ ముందు లేకపోతే మనమంతా జీరోలమన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదని స్పష్టం చేశారు. అంతకంటే మంచి నేతలు పార్టీలోకి వస్తారన్నారు. కోటంరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యంగా మారబోతోందని కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-03T15:00:44+05:30 IST