YCP: వైసీపీ బరితెగింపు... మరీ అంత దౌర్జన్యమా..?

ABN , First Publish Date - 2023-03-05T10:36:00+05:30 IST

ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ప్రచారాల్లో వైసీపీ (YCP) బరితెగించింది. ఏఎస్ పేట ప్రభుత్వ పాఠశాలల్లోనే వైసీపీ శ్రేణులు సమావేశాలు ఏర్పాటు చేశారు.

YCP: వైసీపీ బరితెగింపు... మరీ అంత దౌర్జన్యమా..?

నెల్లూరు: ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ప్రచారాల్లో వైసీపీ (YCP) బరితెగించింది. ఏఎస్ పేట ప్రభుత్వ పాఠశాల్లోనే వైసీపీ శ్రేణులు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో వైసీపీ నేతలు బోయిళ్ల పద్మజారెడ్డి, చెంచురెడ్డి, పులిమి రమేశ్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీకే ఓట్లు వేయాలంటూ ఉపాధ్యాయులకు వారు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దాంతో వైసీపీ నేతల తీరుపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

ఇదిలావుండగా... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఈ ఎన్నికల్లో కనీసం ప్రైవేటు ఓటర్లతో అయినా గెలవాలని అధికార వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. టీచర్లకు బహుమతులు, నగదు పంపిణీతో పాటు ఉన్నతాధికారులతో ఒత్తిళ్లు తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది. అన్ని కోణాల్లోనూ రాజకీయానికి దిగి వారిని అష్టదిగ్బంధం చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు 16న నోటిఫికేషన్‌ జారీ కానుండటంతో అధికార పార్టీ అడ్డదారి ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తోంది. ఒకవైపు గెలుపు కోసం వైసీపీ తీవ్రంగా యత్నిస్తుంటే చేస్తుంటే, మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు వాటిని తిప్పికొట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. తాజాగా పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు నేరుగా లంచ్‌ బాక్స్‌ల పంపిణీకి దిగడం ఎన్నికలను మరింత వాడీవేడిగా మార్చేశాయి. ఈ వ్యవహారంతో ఉపాధ్యాయ వర్గాలు విస్తుపోయాయి.

ఇలా బహిరంగంగా ప్రలోభాలకు దిగితే ఇక ఎన్నికలు ఎలా జరుగుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇది మొదటి అడుగు మాత్రమేనని... వైసీపీ సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. టీచర్లకూ ఓటుకు నోటు పంచేందుకు అధికార పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లంచ్‌ బాక్స్‌ల పంపిణీ ద్వారా అనుకూలంగా ఉన్నారనుకున్న చోట్ల ఓటుకు రూ.5 వేల వరకూ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. వైసీపీ తరఫు అభ్యర్థే శాసనమండలిలో అడుగుపెట్టాలనివైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాల తరఫున మండలిలో ప్రాతినిధ్యం కోల్పోతామేమోనన్న ఆందోళన టీచర్లలో వ్యక్తమవుతోంది.

Updated Date - 2023-03-05T10:50:47+05:30 IST