Share News

TDP-Janasena : చంద్రబాబు విజన్-2020 పై ప్రత్యేకంగా మాట్లాడిన పవన్!

ABN , First Publish Date - 2023-10-23T21:03:14+05:30 IST

రాజమండ్రిలో జరిగిన టీడీపీ-జనసేన (TDP-Janasena) సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా మేనిఫెస్టో, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై (Chandrababu Arrest) నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చంద్రబాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు..

TDP-Janasena : చంద్రబాబు విజన్-2020 పై ప్రత్యేకంగా మాట్లాడిన పవన్!

రాజమండ్రిలో జరిగిన టీడీపీ-జనసేన (TDP-Janasena) సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా మేనిఫెస్టో, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై (Chandrababu Arrest) నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చంద్రబాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ చంద్రబాబు విజన్ -2020 అంటే నేను ఏదో అనుకున్నాను. రాళ్ళు, రప్పలు వున్న ప్రాంతం చూసి ఇది ఎలా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాను. కానీ మన కళ్ళ ముందు జరిగింది.. చంద్రబాబు విజన్ ఏమిటి అనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం అవసరం. అనుభవం ఉన్న నాయకుడు అవసరం. చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరం. మనం రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాం.. చిన్న లోపం కూడా రాకూడదు. అందరం అప్రమత్తంగా ఉండాలి’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.


Pawan.jpg

భేటీలో ఏం చర్చించారు..?

  • టీడీపీ-జనసేన మధ్య పొత్తులు సఫలీకృతమయ్యేలా పూర్తి సమన్వయంతో వెళ్లాలనే అంశంపైనే జేఏసీ భేటీలో సుదీర్ఘ చర్చ

  • వీలైనంత వరకు రెండు పార్టీల మధ్య ఏ చిన్నపాటి గొడవ కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయపడిన టీడీపీ-జనసేన జేఏసీ

  • జిల్లా స్థాయిలో రెండు పార్టీల నుంచి చెరో 50 మంది సమావేశమై ఆత్మీయ కలయికలా సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం

  • ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం

  • ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సమన్వయ సమావేశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనే అభిప్రాయానికి వచ్చిన జేఏసీ

  • జిల్లా స్థాయిలో జరిగే సమావేశాలకు ఇరు పార్టీల నుంచి ఒక్కో సీనియర్ నేతను సమన్వయానికి పంపాలని నిర్ణయం

  • టీడీపీ-జనసేన పార్టీల మధ్య ఏదో రకంగా గొడవలు పెట్టేందుకు వైసీపీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుందన్న పవన్ కళ్యాణ్

  • సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య క్లాష్ వచ్చేలా అధికార పార్టీ వ్యవహరిస్తుందని లోకేష్ ప్రస్తావన

  • టీడీపీ-జనసేన పొత్తులపై వైసీపీ దూసే కత్తులను అధిగమించాల్సి ఉంటుందన్న నేతలు

  • ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీల కేడర్ కలిసిపోయి పని చేసుకుకుంటున్నారన్న నేతలు

  • సమావేశంలో బీజేపీ అంశంపై ప్రస్తావన

  • నేను ఎన్డీఏలో ఉన్నాననే విషయాన్ని ఇప్పటికే వివిధ సందర్భాల్లో చెప్పానన్న పవన్

  • ఏపీ ప్రయోజనాల కోసం.. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటం కోసం అత్యవసరంగా కలిశామన్న నేతలు

Updated Date - 2023-10-23T21:05:34+05:30 IST