Share News

వైసీపీని ఓటుతో తరిమికొట్టాలి

ABN , First Publish Date - 2023-11-21T00:16:04+05:30 IST

రాష్ట్రంలో ఒక పక్క నిత్యావసర ధరలు పెరిగి పోతున్నాయని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని అలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తమ ఓటుతో తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ శాసనసభ్యులు బి.ఎన్‌.విజయకుమార్‌ అన్నారు. సోమవారం సాయంత్రం నందిపాడు గ్రామంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదల సంపాదనంతా పన్నుల రూపంలో దండుకుంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు జయంత్‌బాబు మాట్లాడుతూ ప్రజలకు కరంటు బిల్లులు గణనీయంగా పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీని ఓటుతో తరిమికొట్టాలి
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ శాసనసభ్యులు బి.ఎన్‌.విజయకుమార్‌

మద్దిపాడు, నవంబరు 20 : రాష్ట్రంలో ఒక పక్క నిత్యావసర ధరలు పెరిగి పోతున్నాయని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని అలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తమ ఓటుతో తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ శాసనసభ్యులు బి.ఎన్‌.విజయకుమార్‌ అన్నారు. సోమవారం సాయంత్రం నందిపాడు గ్రామంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదల సంపాదనంతా పన్నుల రూపంలో దండుకుంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు జయంత్‌బాబు మాట్లాడుతూ ప్రజలకు కరంటు బిల్లులు గణనీయంగా పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంతో ప్రజల ప్రాణాలతో వైకాపా ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ఒక్కసారి అధికారమిస్తేనే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని విమర్శించారు. బి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని వాటిని వెళ్ళగొట్టిందాకా వైకాపా పాలకులకు నిద్ర పట్టలేదన్నారు. మన్నం శేషయ్య మాట్లాడుతూ వెనుబడిన వర్గాల సంక్షేమం వారికి రాజకీయ అవకాశాలు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండవ లక్ష్మీనారాయణ, రావి సుబ్బారావు, మండవ గోపీ, దేవబత్తిన ప్రసాద్‌, నాగన్నపాలెం సర్పంచు కాకర్ల విజయకుమార్‌, సీతారామపురం సర్పంచ్‌ మండవ శివానందరావు, మద్దిపాడు మాజీ సర్పం చు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, దాసరి రమేష్‌, చింతల శ్రీనివాససరావు, రావి నరసింహారావు, పాటిబండ్ల అజయ్‌, ముళ్ళూరి మురళి, పోకూరి శ్రీనివాసరావు, పొదిలి ప్రభావతి, పొదిలి అంకమరావు, తన్నీరు ప్రశాంత్‌, రావి ఉమాహేశ్వరరావు, మారెళ్ల హరికుమార్‌, నర్రా ప్రసాద్‌, కొర్రపాటి మాధవరావు, తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T00:16:05+05:30 IST