Share News

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Mar 30 , 2025 | 10:31 PM

ప్రతి కుటుంబ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆదివారం మండలంలోని ఇసుకదర్శి ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 43 మందికి మంజూరైన రూ.22 లక్షల 82వేల304 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాధితులకు పంపిణీ చేశారు.

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందుకున్న బాధితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి

43 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను

పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలూరి

మార్టూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : ప్రతి కుటుంబ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆదివారం మండలంలోని ఇసుకదర్శి ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 43 మందికి మంజూరైన రూ.22 లక్షల 82వేల304 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 నెలలు కాలంలో నియోజకవర్గంలో 320 మందికి సుమారు 3 న్నర కోట్లకు పైగా రూపాయలను సీఎం సహాయనిధి నుంచి బాధతుల వైద్య ఖర్చుల కోసం పంపిణీ చేశామన్నారు. పేద కుటుంబాలు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యం కోసం వారు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం సహాయనిది ద్వారా సాయం అందిస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం నిధులు మంజూరు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు అందించే వైద్య సేవలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మా ర్టూరు, పర్చూరు ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీల సంఖ్య పెరుగుతుందంటే అందుకు కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యలేనన్నారు. కార్యక్రమంలో తాటి నాగేఽశ్వరరావు, అడుసుమల్లి శ్రీనివాసరావు, కోటపాటి సురేష్‌, నాయుడు హనుమంతరావు, కంభంపాటి హనుమంతరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 10:31 PM