AP News: వచ్చె ఎన్నికల్లో వైసీపీ గెలుపుపై ఎంపీ రఘురామ చెప్పిన విషయం ఇదే
ABN , First Publish Date - 2023-01-17T15:31:44+05:30 IST
ఏపీ (AP) ఓటర్ల ప్రస్తుత అభిప్రాయంపై సర్వే చేయించానని ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghurama Krishnam Raju) తెలిపారు.
ఢిల్లీ: ఏపీ (AP) ఓటర్ల ప్రస్తుత అభిప్రాయంపై సర్వే చేయించానని ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghurama Krishnam Raju) తెలిపారు. త్వరలో పూర్తి సర్వే రాబోతుందన్నారు. వైసీపీ (YCP)కి 40-50 కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. గత ఎన్నికల్లో బాబాయ్ హత్య చాలా ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. చిన్నాన్నను ఎవరు చంపించారో స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. అవినీతి చేయని పవన్ (Pawan Klayan)పై తమ పార్టీ దూషణలు చేస్తోందన్నారు. పవన్‌పై ఎలాంటి కేసులు లేవని, మనపై 31 కేసులు ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టుల కోసం జగనన్న (Jagan) ఖర్చు చేసింది రూ.18 వేల కోట్లు మాత్రమేనని, చంద్రబాబు (Chandrababu) అభివృద్ధి చేయలేదని చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. కర్నూలులో హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులు కావాలా లేక హైకోర్టు కావాలా? అనే దానిపై చర్చ పెట్టాలని రఘురామ కృష్ణరాజు సూచించారు. పోలవరంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు.