ఎన్నికల హామీ నెరవేర్చి..!

ABN , First Publish Date - 2023-02-27T23:44:31+05:30 IST

అనేక పర్యాయాలు మునిసిపల్‌ సమావేశాల్లో 30వ వార్డు ఉదయపురంలో తాగునీటి బోరు ఏర్పాటు చేయా లని కోరినా, తాగునీటి కోసం తగాదా పెట్టుకున్నా అధికారులు గాని, పాలకులు గాని స్పందించలేదు. టీడీపీ కౌన్సిలర్‌ అనే ఒకే ఒక్క కారణంతో ప్రజలకు తాగునీరందించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బోరు ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవే ర్చేందుకు ఆ వార్డు కౌన్సిలర్‌ డొక్కరి తులసి స్వయంగా రం గంలోకి దిగారు.

ఎన్నికల హామీ నెరవేర్చి..!
బోరు పనులను ప్రారంభిస్తున్న డొక్కరి తులసి, శంకర్‌

స్నేహితుని సాయంతో బోరు ఏర్పాటు

శభాష్‌ అనిపించుకున్న టీడీపీ కౌన్సిలర్‌

పలాస: అనేక పర్యాయాలు మునిసిపల్‌ సమావేశాల్లో 30వ వార్డు ఉదయపురంలో తాగునీటి బోరు ఏర్పాటు చేయా లని కోరినా, తాగునీటి కోసం తగాదా పెట్టుకున్నా అధికారులు గాని, పాలకులు గాని స్పందించలేదు. టీడీపీ కౌన్సిలర్‌ అనే ఒకే ఒక్క కారణంతో ప్రజలకు తాగునీరందించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బోరు ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవే ర్చేందుకు ఆ వార్డు కౌన్సిలర్‌ డొక్కరి తులసి స్వయంగా రం గంలోకి దిగారు. భర్త శంకరరావు ఓ అజ్ఞాత స్నేహితునికి విషయం తెలిపారు. కోరిందే తడవుగా సదరు స్నేహితుడు రూ.5 లక్షలు నిధులు సమ కూర్చడంతో బోరు ఏర్పాటుకు సోమవారం శ్రీకారం చుట్టారు. పనులకు కౌన్సిలర్‌ దంపతులు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. రెండురోజుల్లో పనులను పూర్తిస్థాయిలో చేపట్టి ప్రజల దాహార్తిని తీర్చ నున్న ట్లు వారు పేర్కొన్నారు. గ్రామంలో బోరు ఏర్పాటుకు కౌన్సిలర్‌ దంపతు లు స్వయంగా ముందుకు రావడంపై స్థానికులు తలగాన మోహన్‌, జోగ శ్రీను, కోనారి రాఘవ, రాజు, ఎం.మోహన్‌, దాలిరాజు, కూర్మాపు కృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేసి వారిని అభినందించారు.

Updated Date - 2023-02-27T23:44:32+05:30 IST

News Hub