TarakRatna : తారకరత్న ఆరోగ్యంపై Jr Ntr కు డాక్టర్లు ఏం చెప్పారంటే.. ఫ్యాన్స్‌కు రెక్వెస్ట్..

ABN , First Publish Date - 2023-01-29T13:43:13+05:30 IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను (Nandamuri Tarakaratna)చూసేందుకు సోదరులు జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr), కల్యాణ్ రామ్‌..

 TarakRatna : తారకరత్న ఆరోగ్యంపై Jr Ntr కు డాక్టర్లు ఏం చెప్పారంటే.. ఫ్యాన్స్‌కు రెక్వెస్ట్..

బెంగళూరు : బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను (Nandamuri Tarakaratna)చూసేందుకు సోదరులు జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr), కల్యాణ్ రామ్‌ (Kalyan Ram) వెళ్లారు. ఐసీయూ నుంచి బయటికొచ్చాక తారకరత్న భార్య, పిల్లలకు ధైర్యం చెప్పారాయన. అనంతరం తారకరత్న ఆరోగ్యంపై ప్రత్యేకంగా డాక్టర్లతో (Doctors) మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నుంచి బయటికొచ్చాక ఎన్టీఆర్ (Ntr With Media) మీడియాతో మాట్లాడారు. తారకరత్న ట్రీట్మెంట్‌కు (Treatment) స్పందిస్తున్నారని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని జూనియర్ (Junior) చెప్పారు. అన్నయ్యకు (Brother) మంచి ట్రీట్మెంట్ అందుతోందని ఆయన మీడియాకు వెల్లడించారు.

Tarak-and-minister.jpg

అందరూ ప్రార్థించండి..!

27వ తారీఖున మా కుటుంబంలోని (Nandamuri Family) అనుకోని ఘటన జరిగింది. అన్నయ్యకు మెరుగైన వైద్యం అందుతోంది. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని (Recovery) పోరాడుతున్నారు. వైద్యంతోపాటు ఆయన ఆత్మబలం, మనోబలం.. అభిమానుల ఆశీర్వాదం ఉంది. ముఖ్యంగా తాతగారి (Sr Ntr) ఆశీర్వాదం ఆయనకు ఉంది. ఎంతోమంది ఆశీర్వాదం ఆయనకు ఉంది. త్వరలోనే ఈ పరిస్థితి నుంచి కోలుకుని ఇదివరకటిలాగే మనందరితో ఆనందంగా ఉండాలని భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. అభిమానులంతా అన్నయ్య కోసం ప్రార్థించండి.. అభిమానుల ఆశీర్వాదం, ఆలోచనలు ఎంతో ముఖ్యంఅని మీడియా ముఖంగా ఎన్టీఆర్ తెలిపారు.

Tarak-02.jpg

డాక్టర్లు ఎన్టీఆర్‌కు ఏం చెప్పారు..!

అన్నయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అలాగని క్రిటికల్ (Critical Condition) నుంచి బయటికి వచ్చారని కూడా చెప్పలేం. ట్రీట్మెంట్‌కు మాత్రం అన్ని విధాలా స్పందిస్తున్నారు. అన్నయ్యకు ఎక్మో (ECMO) ఇప్పుడు అమర్చలేదు. నేను కుటుంబ సభ్యుడిగా వచ్చాను. వైద్యులు.. కుటుంబ సభ్యుడిగా నాకు ధైర్యం చెప్పారు. ఆ విషయాన్నే అభిమానులతో పంచుకుంటున్నాను. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ (Health Minister Sudhakar) గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంత్రిగారు నాకెంతో ఆప్తులు. ఈ పరిస్థితుల్లో మంత్రిగారు మా వెంట ఉండి సాయం చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. నిమన్స్ నుంచి ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ మరో ఇద్దరు వైద్యులను పిలిపించారు అని ఎన్టీఆర్ మీడియాకు వెల్లడించారు.

Tarak-Bangalore.jpg

కల్యాణ్ రామ్ (Kalyan Ram) కూడా మీడియాతో మాట్లాడారు.మీ అందరి అభిమానంతో తప్పకుండా తమ్ముడు తొందరగా కోలుకుని మనందరి ముందుకు రావాలని ఫ్యాన్స్ (Fans) ప్రార్ధించాలని కోరుకుంటున్నానుఅని కల్యాణ్ రామ్ చెప్పారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడటంతో నందమూరి, నారా అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన తగ్గిందనే చెప్పుకోవచ్చు.

Updated Date - 2023-01-29T13:50:22+05:30 IST