Ayyannapatrudu: అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి.. కొడతారా కొట్టండి
ABN , First Publish Date - 2023-09-01T15:02:03+05:30 IST
విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆపై విడిచిపెట్టారు. అరెస్ట్‌పై అయ్యన్న మాట్లాడుతూ.. విశాఖ ఎయిర్పోర్టుకు రాగానే హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు.
అనకాపల్లి: విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని (TDP Leader Ayyannapatrudu) అరెస్ట్ చేసిన పోలీసులు ఆపై విడిచిపెట్టారు. అరెస్ట్‌పై అయ్యన్న మాట్లాడుతూ.. విశాఖ ఎయిర్పోర్టుకు రాగానే హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇటీవల గన్నవరం సమావేశంలో మాట్లాడిన తీరుకు అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు చెప్పి విశాఖ నుంచి తాళ్లపాలెం వరకు తీసుకువచ్చారన్నారు. పైనుంచి పోలీసులకు ఫోన్ రావడంతో 41 నోటీస్ ఇచ్చి పది రోజులలో వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి వదిలేశారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. పోలీసులు ఎప్పుడు రమ్మన్నా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పోలీసులు అరెస్టు చేసుకుంటారా చేసుకోండి.. కొడతారా కొట్టండి... చంపేస్తారా చంపేయండి రాష్ట్రం కోసం చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు.