TDP: మోసపూరిత నిబంధనలతో విదేశీ విద్యను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది

ABN , First Publish Date - 2023-07-30T16:33:25+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ విమర్శలు గుప్పించారు.

TDP: మోసపూరిత నిబంధనలతో విదేశీ విద్యను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ విమర్శలు గుప్పించారు.


"మోసపూరిత నిబంధనలతో విదేశీ విద్యను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. విదేశీ విద్యలో జగన్ మోసంపై ప్రశ్నలు. అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య అని పెట్టడం దళితులను వంచించడం కాదా?. 2014-19 ఎన్టీఆర్ విదేశీ విద్య కింద 4,923 మందిని పంపిస్తే.. నాలుగేళ్లలో 40 మందిని కూడా పంపిలేని అసమర్థ సీఎం జగన్ రెడ్డి. బబ్జెట్ వైజ్ 50 యూనివర్సిటీలకు మాత్రమే పంపిస్తామనే నిబంధనతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోవట్లేదా?. జగతి పబ్లికేషన్స్‌కు ప్రకటనల ద్వారా కోట్ల రూపాయల నిధులు దోచిపెట్టేందుకే విదేశీ విద్య అమలు చేయడం వాస్తవం కాదా?. ఇంటికి ఒక్క విద్యార్థికే అనుమతి నిబంధనతో పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులను దిక్కుతోచని స్థితిలో పడేయలేదా?. మెరిట్ విద్యార్థులకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయడంతో మధ్యతరగతి, పేద విద్యార్థులు ఉపాధి, ఉద్యోగాలకు దూరం చేయట్లేదా?." అని బుచ్చిరామ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-30T16:33:51+05:30 IST