AP NEWS: బండారు సత్యనారాయణమూర్తికి బెయిల్ మంజూరు

ABN , First Publish Date - 2023-10-03T22:02:35+05:30 IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి(Bandaru Satyanarayanamurthy)కి బెయిల్ వచ్చింది.

AP NEWS: బండారు సత్యనారాయణమూర్తికి బెయిల్ మంజూరు

గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి(Bandaru Satyanarayanamurthy)కి బెయిల్ వచ్చింది. రూ.25 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బండారు అరెస్ట్ నాటకీయ కోణంలో జరిగింది. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. మాజీమంత్రి బండారుపై నగరపాలెం పీఎస్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

న్యాయం గెలుస్తుంది: బండారు సత్యనారాయణమూర్తి

అంబేద్కర్ రాజ్యాంగం పట్ల నాకు గౌరవం ఉందని బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానంలో న్యాయం జరిగింది. ధర్మం, న్యాయం గెలుస్తుంది. న్యాయదేవతపై నమ్మకముంది. కష్ట సమయంలో నా కోసం వేచి ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు. చంద్రబాబుకు కూడా త్వరగా బెయిల్ రావాలని కోరుకుంటున్నా. అరెస్టు సమయం నుంచి నారా లోకేష్ నాకు అండగా నిలిచారు’’ అని బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-10-03T22:05:48+05:30 IST