సంగమేశ్వరుడి కోసం
ABN , First Publish Date - 2023-02-19T23:39:17+05:30 IST
లంకలో ఉన్న సీతను తెచ్చేందుకు శ్రీరాముడి కోసం ఉడతలు రామసేతు నిర్మించాయి.

రేగిడి: లంకలో ఉన్న సీతను తెచ్చేందుకు శ్రీరాముడి కోసం ఉడతలు రామసేతు నిర్మించాయి. అటువంటి ప్రయత్నమే చేశారు రేగిడి మండలం సరసనాపల్లి యువకులు. ఏకంగా నదిపై 20 మీటర్ల మేర చెక్కల వంతెన నిర్మించారు. రేగిడి, వంగర మండలాలను వేరుచేస్తూ వేగావతి, సువర్ణముఖి నదులు ఉన్నాయి. సరైన వంతెన లేకపోవడంతో రేగిడి మండలాల ప్రజలు వంగర వెళ్లాలంటే ఆపసోపాలు పడుతున్నారు. కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలకు సైతం చుట్టూ 15 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకుంటున్నారు. వంగర మండలంలో సంగాం సంగమేశ్వరాలయం లో శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. రేగిడి మండలంలోని పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు వెళుతుంటారు. దీంతో యువకులు ఇలా ఆలోచన చేసి.. కొద్దిరోజులు కష్టపడి ఇలా చెక్కల వంతెన నిర్మించారు. దీంతో రెండు మండలాల ప్రజలు ఆ యువకులను అభినందిస్తున్నారు.