Araku Coffee పార్లమెంట్ భవన్‌లో అరకు కాఫీ
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:18 PM
Araku Coffee in the Parliament Building పార్లమెంట్ భవన్‌లో ఈ నెల 24న అరకు కాఫీ స్టాల్ ప్రారంభమవుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం తాను ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పారు.

పార్వతీపురం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ భవన్‌లో ఈ నెల 24న అరకు కాఫీ స్టాల్ ప్రారంభమవుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం తాను ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పారు. అరకు కాఫీకి ఈ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 139 అంగన్‌వాడీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.20.80 కోట్లు మంజూరు చేసిందన్నారు. పీఎం జన్‌మన్ కింద జిల్లాకు 11 కేంద్రాలు మంజూరయ్యాయని వెల్లడించారు. వాటికి సంబంధించి 11 పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న మరో 53 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు చెప్పారు. కొండ శిఖర గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నామన్నారు. డోలీలు మోతలు తప్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా గిరి బజార్ ద్వారా గిరిజనులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు. కంటైనర్ ఆసుపత్రిని కూడా ప్రారంభించామని చెప్పారు.