ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల్ని ఓడించాలి | janasena leader manohar meeting at narasapuram

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల్ని ఓడించాలి

ABN , First Publish Date - 2023-03-03T23:56:57+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఆభ్యర్థుల్ని ఓడించేందుకు జనసేనకులు కంకణం కట్టుకుని పనిచేయాలని జనసేన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పిలుపు నిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల్ని ఓడించాలి
నరసాపురంలో మాట్లాడుతున్న మనోహర్‌

జనసేనకులకు నాదెండ్ల మనోహర్‌ పిలుపు

నరసాపురం టౌన్‌, మార్చి 3: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఆభ్యర్థుల్ని ఓడించేందుకు జనసేనకులు కంకణం కట్టుకుని పనిచేయాలని జనసేన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పిలుపు నిచ్చారు. నరసాపురంలో శుక్రవారం రాత్రి జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసులకు జనసేనకులు భయపడొద్దన్నారు. సమాధానం చెప్పలేకే ఈ చేతకాని ప్రభుత్వం కేసులతో విపక్షాలు, ప్రజల నోర్లు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. మాట్లాడితే... ‘దమ్ముందా... ధైర్యముందా’ అని సీఎం జగన్‌ అనడం హాస్యాస్పదంగా ఉందని, రోడ్డు మార్గంలో వస్తే ప్రజలు ఎక్కడ నిలదీస్తారన్న భయంతో 20 కిలోమీటర్ల దూరం వెళ్లాలన్న ముఖ్యమంత్రి గాలిలోనే ప్రయాణిస్తున్నారని విమర్శించారు. జగన్‌ సభలకు మహిళలెవరైనా నల్లని చున్నీలు వేసుకొస్తే వాటిని కూడా తొలగించి వేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని హీనస్థితికి ప్రభుత్వం చేరుకుందని, మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత వేములదీవి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యు.ఏడుకొండలు కుటుంబానికి పార్టీ తరుపున కన్వీనర్‌ బొమ్మిడి నాయ కర్‌తో కలిసి రూ.5 లక్షల చెక్కును అందించారు. కొటికలపూడి గోవిందరావు, వెంకటలక్ష్మి, రెడ్డి అప్పలనాయుడు, రామచంద్రరావు, ధర్మరాజు, చంద్రశేఖర్‌, విశాలి, కోటిపల్లి వెంకటేశ్వరావు, ఆకన చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-03T23:56:57+05:30 IST