రంగనాథస్వామిగా అష్టభుజ లక్ష్మీనారాయణ
ABN , First Publish Date - 2023-01-03T23:36:47+05:30 IST
ధనుర్మాసం 19వ రోజు మంగళవారం అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి తల్పగిరి రంగనాథస్వామిగా అలంకరించారు.
పాలకొల్లు అర్బన్, జనవరి 3: ధనుర్మాసం 19వ రోజు మంగళవారం అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి తల్పగిరి రంగనాథస్వామిగా అలంకరించారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. వేకువజాము నుంచి అర్చకులు స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, తిరుమంజన సేవలు నిర్వహించారు.
కెనాల్ రోడ్డులోని దాసోహాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని చెరకు గడలు, తులసి, చామంతులతో అలంకరించారు. ఆలయ అర్చకులు ఎం శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో గంధ సింధూర, తమల పాకుల పూజలు చేశారు.