Share News

Yashaswini Reddy : మహిళలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలుపుకున్నది

ABN , First Publish Date - 2023-12-10T19:02:31+05:30 IST

మహిళలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) నిలబెట్టుకుందని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ( Yashaswini Reddy ) పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గడ్డమీద అడుగుపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.

Yashaswini Reddy : మహిళలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలుపుకున్నది

జనగామ జిల్లా: మహిళలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) నిలబెట్టుకుందని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ( Yashaswini Reddy ) పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గడ్డమీద అడుగుపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అప్పిరెడ్డిగూడెం నుంచి పాలకుర్తి వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. ఇంతటి భారీ మెజార్టీతో తనను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారెంటీ కార్డులను అమలు చేస్తామని, ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల వరకు పొడిగించడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన గ్యారెంటీలను కూడా అమలుచేసి మాట నిలబెట్టుకుంటాం. గత 15 సంవత్సరాలుగా పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గత 15 సంవత్సరాలుగా చెయని అభివృద్ధి, ఐదేళ్లలో చేసి చూపిస్తామని యశస్వినిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-12-10T19:02:35+05:30 IST