Angry Man: మొబైల్ యాప్ పెట్టిన చిచ్చు.. కన్నకొడుకునే కత్తితో పొడిచిన తండ్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-06-18T12:03:43+05:30 IST
మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయడంలో జరిగిన ఆలస్యం ఘోరానికి దారితీసింది. కన్న కొడుకునే తండ్రి కత్తితో పొడిచిన ఘటన ఢిల్లీలోని మధు విహార్‌లో వెలుగుచూసింది. మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయడంలో ఆలస్యం దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. వారిద్దరి గొడవ మధ్యలో వెళ్లడమే 23 ఏళ్ల వారి కుమారుడికి శాపంగా మారింది.
ఢిల్లీ: మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయడంలో జరిగిన ఆలస్యం ఘోరానికి దారితీసింది. కన్న కొడుకునే తండ్రి కత్తితో పొడిచిన ఘటన ఢిల్లీలోని మధు విహార్‌లో వెలుగుచూసింది. మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయడంలో ఆలస్యం దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. వారిద్దరి గొడవ మధ్యలో వెళ్లడమే 23 ఏళ్ల వారి కుమారుడికి శాపంగా మారింది. సహనం కోల్పోయిన తండ్రి కనిపెంచిన కొడుకని కూడా చూడకుండా ఛాతిలో కత్తితో పొడిచాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 64 ఏళ్ల అశోక్ సింగ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. అశోక్ సింగ్ తన భార్య మంజు సింగ్, కుమారుడ్ ఆదిత్య సింగ్‌తో కలిసి ఐపీ ఎక్స్‌టెన్సన్‌లో నివాసం ఉంటున్నారు. ఆదిత్య సింగ్ గురుగ్రామ్‌లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అయితే అశోక్ సింగ్ ఇటీవల గురుగ్రామ్‌లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించి అడ్వాన్స్ చెల్లించడానికి, అశోక్ సింగ్ తన భార్య మంజు సింగ్‌ను మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయమన్నాడు. యాప్ డౌన్‌లోడ్ చేయడంలో మంజూ సింగ్ ఆలస్యం చేయడంతో అశోక్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
అక్కడే ఉన్న కొడుకు ఆదిత్య సింగ్ తల్లిదండ్రుల గొడవను గమనించి మధ్యలో జోక్యం చేసుకున్నాడు. దీంతో సహనం కోల్పోయిన అశోక్ సింగ్.. వంటగదిలో వాడే కత్తి తీసుకోని కొడుకు ఆదిత్య సింగ్ ఛాతిలో పొడిచాడు. దీంతో ఆదిత్య సింగ్ పక్కటెముకలపై రెండు గాయాలు కావడంతో లాల్ బహుదుర్ శాస్త్రి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఆదిత్య సింగ్‌ను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే కత్తితో పొడిచిన అశోక్ సింగ్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం కేసు నమోదు చేశారు.