Bank of barodaలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ABN , First Publish Date - 2023-03-01T16:54:26+05:30 IST

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Bank of barodaలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!
ఖాళీలెన్నంటే..!

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌: 24

విభాగాలు: ఎన్‌ఆర్‌ఐ వెల్త్‌ ప్రొడక్ట్స్‌ మేనేజర్‌, గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌, వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌, హెడ్‌ వెల్త్‌-టెక్నాలజీ, ప్రొడక్ట్‌ మేనేజర్‌(ట్రేడ్‌ అండ్‌ ఫారెక్స్‌), ట్రేడ్‌ రెగ్యులేషన్‌ సీనియర్‌ మేనేజర్‌

2. ప్రయివేట్‌ బ్యాంకింగ్‌: 17

విభాగాలు: రేడియన్స్‌ ప్రయివేట్‌ సేల్స్‌ హెడ్‌, ప్రొడక్ట్‌ హెడ్‌-ప్రైవేట్‌ బ్యాంకింగ్‌, ప్రైవేట్‌ బ్యాంకర్‌

3. అక్విజిషన్‌: 505

విభాగాలు: అక్విజిషన్‌ ఆఫీసర్‌, నేషనల్‌ అక్విజిషన్‌ హెడ్‌, రీజనల్‌ అక్విజిషన్‌ సేల్స్‌ హెడ్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ(గ్రాడ్యుయేషన్‌) ఉత్తీర్ణత.

వయసు:

1. అక్విజిషన్‌ విభాగానికి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21-28 ఏళ్లు ఉండాలి.

2. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 25-50 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు:

1. మెట్రో నగరాల్లోని అభ్యర్థులకు ఏటా రూ.5లక్షలు చెల్లిస్తారు.

2. నాన్‌ మెట్రో నగరాల్లోని అభ్యర్థులకు ఏటా రూ.4 లక్షలు చెల్లిస్తారు.

ఇతర అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం జీతభత్యాలు ఉంటాయి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఆన్‌లైన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్షలో భాగంగా రీజనింగ్‌, ఇంగ్లీష్‌ ల్యాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం

దరఖాస్తు ఫీజు: రూ.600

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 14

వెబ్‌సైట్‌: https:// www. bankofbaroda.in/ career/currentopportunities

Updated Date - 2023-03-01T16:54:26+05:30 IST