Revenue Department: ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా అసైన్డ్ కమిటీలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 05:49 AM
ప్రభుత్వం, జిల్లాలో అసైన్డ్, మిగులు భూముల పంపిణీ కోసం కమిటీలను పునరుద్ధరించింది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ కాకుండా జాయింట్ కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారు.

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసైన్డ్, మిగులు భూముల పంపిణీ వంటి అంశాలను సమీక్షించేందుకు ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు చైర్మన్లుగా ప్రభుత్వం కమిటీలను పునరుద్ధరించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా గురువారం ఉత్తర్వు(జీఓ104) జారీ చేశారు. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించే మంత్రులు, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో భూ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ ఈ కమిటీ సభ్య కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, తాజాగా ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌కు అవకాశం ఇవ్వలేదు. జిల్లా స్థాయిలో ఖాళీగా ఉన్న భూములను రెవెన్యూశాఖ సిఫాసుల మేరకు ఈ కమిటీ పరిశీలించి అర్హులైన పేద లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. మాజీ సైనికులకు ఇచ్చే భూములనూ ఈ కమిటీనే ఖరారు చేయనుంది.
For More AP News and Telugu News