CM Chandrababu Naidu: నేడు చెన్నైకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ABN , Publish Date - Mar 28 , 2025 | 06:52 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం చెన్నై నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అడయార్‌లోని ‘మద్రాస్ ఐఐటీ’లో ఉదయం 11 గంటలకు జరుగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025’లో పాల్గొని ప్రసంగించనున్నారు.

- ఉదయం 10.30 గంటలకు విమానాశ్రయానికి చేరిక
- ‘మద్రాస్ ఐఐటీ’ కార్యక్రమానికి హాజరు
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) శుక్రవారం చెన్నై రానున్నారు. అడయార్‌లోని ‘మద్రాస్ ఐఐటీ’లో ఉదయం 11 గంటలకు జరుగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025’లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకోసం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10.30 గంటలకు రానున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ(TDP) కార్యకర్తలు, అభిమానులు సిద్ధమవుతున్నారు. కాగా మీనంబాక్కంలోని పాత విమానాశ్రయంలో వీఐటీ గేట్ (6వ నెంబరు గేట్) నుంచి చంద్రబాబు బయటకు రానున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: India's Richest 2025: ఆస్తి తగ్గినా.. అంబానీదే అగ్రస్థానం
ఇదిలా ఉండగా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి చెన్నై వస్తున్న చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులంతా తరలిరావాలని చెన్నై టీడీపీ అధ్యక్షులు చంద్రశేఖర్(Chennai TDP President Chandrashekhar) విజ్ఞప్తి చేశారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు మద్రాస్ ఐఐటీ నుంచి విమానాశ్రయం చేరుకుని, విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
పాస్టర్ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు
మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు
గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..
Read Latest Telangana News and National News