Amit Shah: భారతదేశం ధర్మసత్రం కాదు
ABN , Publish Date - Mar 28 , 2025 | 05:47 AM
భారతదేశం ధర్మసత్రం కాదని, దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని భారత్‌లో అడుగుపెట్టనివ్వమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వ్యాపారం, విద్య, వైద్యం కోసం వచ్చే వారిని, పర్యాటకులను, పెట్టుబడులు పెట్టి దేశ ఆర్థిక ప్రగతికి సహకరించేవారిని భారతదేశంలోకి స్వాగతిస్తామని ప్రకటించారు.

దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని రానివ్వం: అమిత్ షా
వలసలు, విదేశీయుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ, మార్చి 27: భారతదేశం ధర్మసత్రం కాదని, దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని భారత్‌లో అడుగుపెట్టనివ్వమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వ్యాపారం, విద్య, వైద్యం కోసం వచ్చే వారిని, పర్యాటకులను, పెట్టుబడులు పెట్టి దేశ ఆర్థిక ప్రగతికి సహకరించేవారిని భారతదేశంలోకి స్వాగతిస్తామని ప్రకటించారు. వలసలు, విదేశీయులు(ఇమ్మిగ్రేషన్స్ అండ్ ఫారినర్స్) 2025 బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. బిల్లులోని పలు అంశాలు ఇమ్మిగ్రేషన్ అధికారులకు అపరిమిత అధికారాన్ని ఇస్తున్నాయని, ఆయా అంశాలపై జేపీసీ(జాయిం ట్ పార్లమెంటరీ కమిటీ)తో అధ్యయనం చేయించాలని విపక్ష సభ్యులు చేసిన డిమాండ్లు ఫలించకపోగా.. మూజువాణీ పద్ధతిలో బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మూడు గంటలకు పైగా సాగిన చర్చలో.. వలసలు, విదేశీయులు బిల్లు ఆవశ్యకతను వివరిస్తూ అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. వలసలు, విదేశీయుల 2025 బిల్లు దేశ భద్రతను బలోపేతం చేస్తుందని, 2047 నాటికి భారత్‌ను అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడుతుందని తెలిపారు. భారత్- బంగా సరిహద్దులో జరుగుతున్న చొరబాట్లపై పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రె్‌స ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
షాపై హక్కుల నోటీసు తిరస్కరణ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ఏఐసీసీ ప్రధా న కార్యదర్శి జైరాం రమేశ్ ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసును రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. మంత్రి ఎ లాంటి హక్కులనూ అతిక్రమించలేదని చెప్పారు.