మినీ వర్కవుట్స్‌తో లాభమా? నష్టమా? అయితే ఇది మీకోసమే!
ABN , First Publish Date - 2023-02-22T13:12:11+05:30 IST
తినటానికే సమయం లేదంటుంటారు కొందరు. అలాంటి వాళ్లు వర్కవుట్స్ చేయాలంటే గంటల సమయం వృథా అవుతుందని పెద్దగా పట్టించుకోరు. దీనికి ఓ మినహాయింపు
తినటానికే సమయం లేదంటుంటారు కొందరు. అలాంటి వాళ్లు వర్కవుట్స్ చేయాలంటే గంటల సమయం వృథా అవుతుందని పెద్దగా పట్టించుకోరు. దీనికి ఓ మినహాయింపు ఉంది. పెద్ద వీడియో బదులుగా షార్ట్స్, రీల్స్ వచ్చినట్లు.. ఇప్పుడు మినీ వర్కవుట్స్ కూడా ట్రెండ్. ఇంతకీ మినీ వర్కవుట్స్ వల్ల లాభమా? నష్టమా? పది నిముషాల వర్కవుట్స్ అంటే ఉదయం లేదా సాయంత్రం, రాత్రిపూట చేసుకోవచ్చు. యోగా (Yoga), పుషప్స్, వేగంగా నడవడం, బ్రిస్క్ వాక్, సైక్లింగ్ (Cycling), కార్డియో వర్కవుట్స్, జంపింగ్, వాల్ పుషప్స్, డ్యాన్స్ (Dance) చేయటం.. లాంటి మినీ వర్కవుట్స్‌ను ఎవరైనా సులువుగా చేసుకోవచ్చు.
గంటల తరబడి వర్కవుట్స్ చేయలేకపోయినా మినీ వర్కవుట్స్‌తో కాసింతయినా ఉపశమనం, యాక్టివ్‌నెస్ వస్తుంది. ఏమీ చేయకుండా ఉండే బదులు మినీ వర్కవుట్స్ మంచిదే అంటున్నారు కొందరు నిపుణులు. కనీసం రోజూ 150 నిముషాలు ఏరోబిక్స్ చేయడం కంటే వారాంతంలో 75 నిముషాల పాటు ఇన్టెన్స్ ఏరోబిక్ యాక్టివిటీ చేస్తే కచ్చితంగా మంచి ఫలితాలుంటాయని అమెరికా (America)లోని డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ శాస్త్రవేత్తలంటున్నారు.
లాంగ్ వర్కవుట్స్ కంటే..
ఉదయం లేస్తూనే జిమ్ (Gym)లో కసరత్తులు గంటలపాటు చేసేవారుంటారు. అయితే బిజీ పీపుల్ మాత్రం మినీ వర్కవుట్స్‌ను ఆశ్రయించవచ్చు. అంటే ఐదు లేదా పది నిముషాలు పర్ఫెక్ట్‌గా నిపుణుల సమక్షంలో వర్కవుట్స్ చేస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు రోజును ఎనర్జీగా ప్రారంభించవచ్చు. ఆరోగ్యకరమైన జీవక్రియలతో పాటు క్యాలరీస్ బర్న్ అయి బరువు కూడా తగ్గవచ్చు. డంబెల్స్ సాయంతో రోజూ పది నిముషాల పాటు కసరత్తులు చేస్తే మాత్రం కొవ్వు కరిగిపోతుంది. జీవక్రియ సాఫీ అవుతుంది. కండరాల్లో బలం పెరుగుతుంది. మినీ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే శరీరంలో యాక్టివ్‌నెస్ పెరిగి, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చురుగ్గా ఉంటే శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. నిద్ర సాఫీగా పడుతుంది. మినీ వర్కవుట్స్ నిదానంగా, క్లారిటీగా చేయాలి. లాంగ్ వర్కవుట్స్ గంటల పాటు చేస్తే గాయాలబారిన పడే అవకాశాలు ఎక్కువ. మినీ వర్కవుట్స్‌లో ఈ ఇబ్బంది ఉండదు. బరువు తగ్గటం, మజిల్ టోన్ వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. హ్యాపీ హార్మోన్లు విడుదల కావటం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతాయి.