Baba Vanga Predictions: 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని చంపేస్తారు.. బాబా వంగా 7 సంచలన ప్రెడిక్షన్స్
ABN , First Publish Date - 2023-11-05T18:01:47+05:30 IST
బాబా వంగా పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి అంచనాలు ఎలాగైతే నిజమవుతూ వస్తున్నాయో.. బాబా వంగా ప్రెడిక్షన్స్ కూడా దాదాపు నిజమవుతున్నాయి. నిజానికి..
బాబా వంగా పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి అంచనాలు ఎలాగైతే నిజమవుతూ వస్తున్నాయో.. బాబా వంగా ప్రెడిక్షన్స్ కూడా దాదాపు నిజమవుతున్నాయి. నిజానికి.. బల్గేరియాకు చెందిన ఆ అంధ ఆధ్యాత్మికవేత్త 1996లోనే మృతి చెందారు. ఆమెను ‘నోస్ట్రాడమస్ ఆఫ్ బాల్కన్స్’ అని కూడా పిలుస్తారు. 9/11 ఉగ్రదాడి, చెర్నోబిల్ డిజాస్టర్, యువరాణి డయానా మరణంతో పాటు ఇతర సంఘటనల్ని ముందుగానే అంచనా వేయడంతో.. ఆమె ఒక కల్ట్ ఫిగర్‌గా అవతరించారు. ఇప్పుడు 2024 సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో.. ఆ ఏడాదికి సంబంధించి ఆమె చెప్పిన భవిష్యవాణి ఏంటన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. పదండి, ఆమె ప్రెడిషన్స్ ఏంటో తెలుసుకుందాం!
* వచ్చే ఏడాదిలో.. అంటే 2024లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని సొంత దేశస్థుడే చంపేందుకు ప్రయత్నిస్తాడు.
* ఒక పెద్ద దేశం జీవ ఆయుధాలను పరీక్షించి, దాడులు నిర్వహిస్తుంది. యూరప్‌లోని వివిధ నగరాల్లో ఉగ్రదాడులు జరుగుతాయి.
* 2024లో భయానక వాతావరణ సంఘటనలు, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. రేడియేషన్ ప్రమాదం కూడా ఉంటుంది.
* సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉంది. అధునాతన హ్యాకర్లు.. పవర్ గ్రిడ్‌లు, నీటి శుద్ధి ప్లాంట్ల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుంది.
* 2024లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. దీని కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. రుణ స్థాయిలు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలు ఇందుకు కారణం.
* అల్జీమర్స్, క్యాన్సర్‌తో సహా నయం చేయలేని వ్యాధులకు కొత్త చికిత్సలు 2024లో అందుబాటులోకి వస్తాయి.
* 2024లో క్వాంటం కంప్యూటింగ్‌లో పెద్ద ఆవిష్కరణ జరుగుతుంది. (దీని ద్వారా సాధారణ కంప్యూటర్ కంటే వేగంగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు)
ఇదిలావుండగా.. బాబా వంగా అసలు పేరు వాంజెలియా పాండేవా డిమిత్రోవా. ఆమె 1911లో జన్మించారు. ఆమెకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు.. భారీ తుఫాను కారణంగా కంటి చూపు కోల్పోయారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత.. తన తొలి విజన్ గురించి తల్లిదండ్రులకు ఆమె తెలియజేసింది. అలా క్రమంగా.. కొన్ని సంఘటనల్ని ముందుగానే అంచనా వేయడంతో, ఆమె బాబా వంగాగా ప్రాచుర్యం పొందారు. ఆమె ప్రెడిక్షన్స్‌లో దాదాపు 85 శాతం అంచనాలు నిజమయ్యారని రిపోర్ట్స్ చెప్తున్నాయి.