GHMC: ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:41 AM
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నుపై 5% రాయితీ ప్రకటించింది. ఆస్తి పన్నును ఈ నెల 30 దాకా ముందస్తుగా చెల్లిస్తే ఈ రాయితీ వర్తించనున్నట్లు కమిషనర్ ఇలంబరిది తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎర్లీ బర్డ్ చెల్లింపులో 800 కోట్ల రూపాయల ఆదాయం రాబట్టినట్లు తెలిపారు.

ఎర్లీబర్డ్‌తో ఏప్రిల్ 30 వరకు అవకాశం
హైదరాబాద్ సిటీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నుపై రాయితీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఎర్లీ బర్డ్‌లో భాగంగా ఆర్థిక సంవత్సరం పన్ను మొత్తం ముందస్తుగా చెల్లిస్తే ఐదు శాతం రాయితీ వర్తిస్తుందని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఈ అవకాశాన్ని ఆస్తి పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఇలంబరిది కోరారు. ఈ నెల 30 వరకు ఎర్లీ బర్డ్‌లో ఆస్తి పన్ను చెల్లింపునకు అవకాశముంటుంది. 2024-25లో ఎర్లీ బర్డ్‌లో భాగంగా సంస్థకు రూ.800 కోట్ల ఆదాయం వచ్చింది.