India - Canada:భారత్ చర్యలతో లక్షల మంది జీవితాలు ప్రభావితం: జస్టిన్ ట్రూడో
ABN , First Publish Date - 2023-10-21T08:46:27+05:30 IST
కెనడా 41 మంది దౌత్యవేత్తలను భారత్ నుంచి ఉపసంహరించుకున్నాక ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine Trudo) స్పందించారు. ఇండియా నిర్ణయాలు లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆయన అన్నారు.
కెనడా : కెనడా 41 మంది దౌత్యవేత్తలను భారత్ నుంచి ఉపసంహరించుకున్నాక ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine Trudo) స్పందించారు. ఇండియా నిర్ణయాలు లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆయన అన్నారు. భారత్ విధించిన గడువు ముగిసిన తరువాత కెనడా ప్రభుత్వం 41 మంది దౌత్యవేత్తలను(Diplomats) ఉపసంహరించుకుంది. ఇండియా చర్యల వల్ల ఇరు దేశాల మధ్య ప్రయాణాలు, వ్యాపారాలు, వాణిజ్యం, కెనడాలో చదువుతున్న భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతాయని ట్రూడో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అణచివేత ఇరు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల సాధారణ జీవితాన్ని కష్టతరం చేస్తోందని ఆయన విమర్శించారు. దాదాపు రెండు మిలియన్ల మంది కెనడియన్లలో 5 శాతం మంది భారతీయ వారసత్వాన్ని కలిగి ఉన్నారు. గ్లోబల్ విద్యార్థులకు కెనడా అతిపెద్ద వనరుగా మారింది, స్టడీ పర్మిట్ హోల్డర్లలో దాదాపు 40 శాతం మంది ఉన్నారు.
కెనడా 41 మంది దౌత్యవేత్తలను భారత్ నుంచి ఉపసంహరించుకున్నాక ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine Trudo) స్పందించారు. ఇండియా నిర్ణయాలు లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆయన అన్నారు. భారత్ విధించిన గడువు ముగిసిన తరువాత కెనడా ప్రభుత్వం 41 మంది దౌత్యవేత్తలను(Diplomats) ఉపసంహరించుకుంది. ఇండియా చర్యల వల్ల ఇరు దేశాల మధ్య ప్రయాణాలు, వ్యాపారాలు, వాణిజ్యం, కెనడాలో చదువుతున్న భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతాయని ట్రూడో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అణచివేత ఇరు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల సాధారణ జీవితాన్ని కష్టతరం చేస్తోందని ఆయన విమర్శించారు. దాదాపు రెండు మిలియన్ల మంది కెనడియన్లలో 5 శాతం మంది భారతీయ వారసత్వాన్ని కలిగి ఉన్నారు. గ్లోబల్ విద్యార్థులకు కెనడా అతిపెద్ద వనరుగా మారింది, స్టడీ పర్మిట్ హోల్డర్లలో దాదాపు 40 శాతం మంది ఉన్నారు.