India:గాజాకు వైద్య పరికరాలు పంపి.. ఆపన్న హస్తం అందించిన భారత్
ABN , First Publish Date - 2023-10-22T11:55:06+05:30 IST
ఇజ్రాయెల్ - పాలస్తీనా(Israeil - Palestine) మధ్య జరుగుతున్న యుద్ధంలో వేల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రోజుల క్రితం గాజా(Gaza)లో ఓ హాస్పిటల్ పై జరిగిన వైమానిక దాడిలో 500 మందికి పైగా మరణించారు.
ఢిల్లీ: ఇజ్రాయెల్ - పాలస్తీనా(Israeil - Palestine) మధ్య జరుగుతున్న యుద్ధంలో వేల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రోజుల క్రితం గాజా(Gaza)లో ఓ హాస్పిటల్ పై జరిగిన వైమానిక దాడిలో 500 మందికి పైగా మరణించారు. ఈ టైంలో వైద్య పరికరాల కొరత గాజాను దిక్కుతోచని స్థితిలోకి మార్చింది. అయితే గాయపడిన పాలస్తీనియన్లకు మేమున్నాం అంటూ.. ఆపన్న హస్తం అందిస్తోంది ఇండియా(India). ఇవాళ ఆ ప్రాంతానికి వైద్య సాయం, విపత్తు సహాయ సామగ్రిని పంపింది. గాజాకు పంపిన మెటీరియల్‌లో ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువులు, స్లీపింగ్ బ్యాగ్‌లు, టార్పాలిన్‌లు, శానిటరీ తదితర వస్తువులతోపాటు నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.
దాదాపు 6.5 టన్నుల వైద్య సామగ్రి, 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రితో IAF C-17 విమానం ఈజిప్ట్‌లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరింది. అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధంలో రెండు వైపుల 4 వేల 300 మంది వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడటంతో అక్కడ భారీగా ప్రాణ నష్టం జరిగింది. సాయం చేయాలని గాజా ప్రపంచ దేశాలను అర్థించింది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్(Mahamood Abbas)తో మాట్లాడి, పాలస్తీనియన్ల కోసం మానవతా సాయాన్ని పంపుతామని హామీ ఇచ్చారు. ఈ యుద్ధం జరగడం బాధకరమని.. అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈజిప్టు నుంచి వివిధ దేశాల ద్వారా మానవతా సాయం గాజాకు చేరుతోంది. యుద్ధం ముగించాలని చాలా దేశాలు కోరుతున్నాయి.