Vivek Ramaswamy: వివేక్ రామస్వామికి ర్యాపర్ అల్టిమేటం.. తన మ్యూజిక్ వాడొద్దన్న ఎమినెమ్.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-08-29T16:21:02+05:30 IST
ఎన్నికల ప్రచారంలో ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందరు తమ మాటలతో మాయ చేస్తే, మరికొందరు రకరకాల హామీలతో జనాల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మరికొందరు.. ప్రేక్షకుల్లో...
ఎన్నికల ప్రచారంలో ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందరు తమ మాటలతో మాయ చేస్తే, మరికొందరు రకరకాల హామీలతో జనాల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మరికొందరు.. ప్రేక్షకుల్లో ఉల్లాసం, ఉత్సాహం నింపేందుకు ట్రెండీ మార్గాల్ని అనుసరిస్తారు. ఇప్పుడు వివేక్ రామస్వామి కూడా అదే పని చేస్తున్నారు. రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న వివేక్.. విస్తృతంగా ప్రచారం చేస్తూ, తనలోని ర్యాప్ స్కిల్స్‌ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల లోవా స్టేట్ ఫెయిర్‌లో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ర్యాప్‌స్టార్ ఎమినెమ్ పాడిన ‘లూజ్ యువర్‌సెల్ఫ్’ పాటను వివేక్ పాడి, ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఈ వినూత్న ప్రచారం చేపట్టినందుకు వివేక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది కానీ, ర్యాపర్ ఎమినెమ్ మాత్రం అల్టిమేటం జారీ చేశాడు. తన పాటల్ని వాడుకోవద్దని వివేక్‌కి అతను గట్టిగానే చెప్పాడు. ఈ మేరకు వివేక్‌కు ఒక అధికారిక లేఖను ఎమినెమ్ పంపినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందుకు కారణం.. అనుమతి లేకుండా తాను పాడిన పాటల్ని వివేక్ తన ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకోవడమే. కాగా.. ఇలా అభ్యంతరం వ్యక్తం చేసింది ఒక్క ఎమినెమ్ మాత్రమే కాదు. గతంలో డొనాల్డ్ ట్రంప్ కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌ను తన ఎన్నికల ప్రచారంలో వినియోగించుకుంటే.. రిహన్నా, అడిలి వంటి స్టార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. బ్రిటన్‌కు చెందిన ఒక రాక్ బ్యాండ్ అయితే ట్రంప్‌పై దావా వేస్తామని కూడా హెచ్చరించింది.