Share News

Parliament Security Breach: 14 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే!

ABN , Publish Date - Dec 14 , 2023 | 05:19 PM

పార్లమెంట్‌లో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అనుచితంగా ప్రవర్తించినందుకు గాను వీరిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యేదాకా సభ నుంచి సస్పెండ్ చేశారు. తొలుత ఐదుగురిని సస్పెండ్ చేయగా.. ఆ తర్వాత మరో 9 మంది ఎంపీలను...

Parliament Security Breach: 14 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే!

Parliament Security Breach: పార్లమెంట్‌లో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అనుచితంగా ప్రవర్తించినందుకు గాను వీరిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యేదాకా సభ నుంచి సస్పెండ్ చేశారు. తొలుత ఐదుగురిని సస్పెండ్ చేయగా.. ఆ తర్వాత మరో 9 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. వీరిలో కాంగ్రెస్ నుంచి 9 మంది, సీపీఎం నుంచి ఇద్దరు, డీఎంకే నుంచి ఇద్దరు సీపీఐ నుంచి ఒకరు ఉన్నారు. సభాపతి ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించారనే కారణంగానే వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

మొదట ప్రతాపన్‌, హిబీ ఈడన్‌, జోతి మణి, రమ్యా హరిదాస్‌, డీన్‌ కురియాకోస్‌ సస్పన్షన్‌కు గురయ్యారు. ఈ ఐదుగురు సభాపతి ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రవర్తించిన తీరును తీవ్రంగా పరిగణిస్తూ ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్‌ జోషీ పేర్కొన్నారు. ఈ తీర్మానం ఆమోదం పొందాక సభను 3 గంటలకు వాయిదా వేయడం జరిగింది. సభ ప్రారంభం అవ్వగా.. విపక్ష సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. దీంతో.. బెన్నీ బెహనన్‌, వీకే శ్రీకందన్‌, మహమ్మద్‌ జావెద్‌, పీఆర్‌ నటరాజన్‌, కనిమొళి, కె.సుబ్రహ్మణ్యం, ఎస్‌ఆర్‌ పార్థిబన్‌, ఎస్‌ వెంకటేశన్‌, మాణికం ఠాగూర్‌ను సస్పెండ్‌ చేస్తూ.. ప్రహ్లాద్ జోషీ మరోసారి తీర్మానం ప్రవేశపెట్టగా, దీనికి సభ ఆమోదం తెలిపింది.


‘లోక్‌సభలో భద్రతపై స్పీకర్‌ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు అడిగారని.. ఈ అంశంపై రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు సభలో హితవు పలికారు. కానీ.. ప్రతిపక్షాలు మాత్రం పార్లమెంట్ భద్రతా లోపంలో ఆందనళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ అంశంపై అమిత్ షా మాట్లాడాలని.. దీనికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా సభలో గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ రేపటికి వాయదా వేశారు. అటు.. రాజ్యసభలోనూ తృణమూల్ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ ఓబ్రియన్‌ సైతం సస్పెండ్‌ అయ్యారు. లోక్‌సభలో చోటు చేసుకొన్న భద్రతా లోపంపై చర్చించాలని ఆయన పట్టుబడటంతో సస్పెండ్ చేశారు.

అయితే.. ఓబ్రియన్‌ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఎంపీ డోలాసేన్ తప్పుబట్టారు. పార్లమెంట్ భద్రతా లోపం అనేది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని.. ఈ అంశాన్ని లేవనెత్తడం ప్రతిపక్షంగా తమ కర్తవ్యమని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న తమకు ఈ అంశాన్ని లేవనెత్తడం హక్కుందని.. కాబట్టి తాము వెల్ వద్దకు వెళ్లి నినాదాలు చేశామని చెప్పారు. తమని సస్పెండ్ చేసినా సిద్ధమేనని పేర్కొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 05:19 PM