MLC: నా హత్యకు కుట్ర.. సుపారీ ఇచ్చి చంపించాలని చూస్తున్నారు
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:53 PM
నా హత్యకు కుట్ర.. సుపారీ ఇచ్చి చంపించాలని చూస్తున్నారని మంత్రి రాజణ్ణ కుమారుడు ఎమ్మెల్సీ రాజేంద్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- డీజీపీకి మంత్రి రాజణ్ణ కుమారుడు, ఎమ్మెల్సీ రాజేంద్ర ఫిర్యాదు
బెంగళూరు: రాష్ట్ర సహకార శాఖామంత్రి రాజణ్ణ హనీట్రాప్ చేసేందుకు కుట్రపన్నారని శాసనసభలో ప్రస్తావించిన తర్వాత తీవ్రమైన రోజుకో పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా గురువారం మంత్రి రాజణ్ణ కుమారుడు ఎమ్మెల్సీ రాజేంద్ర(Minister Rajanna's Son, MLC Rajendra) డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Bengaluru: మా చేతులు కట్టేశారు..
వారం రోజులుగా ప్రతిచోటా సాగుతున్న చర్చలపై విచారణ జరిపి ప్రాణరక్షణ కల్పించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. గత ఏడాది నవంబరు 16న కుమార్తె జన్మదిన వేడుకలు జరిపామని షామియానా ఏర్పాటు చేసేవారి తరహాలో హత్య చేసేందుకు వచ్చారన్నారు. ఇటీవల జనవరిలో హత్యకు స్కెచ్ వేసిన విషయమై ఆడియో రికార్డులు ఉన్నాయన్నారు. ఆడియోలో హత్యకు సుపారీ ఇచ్చిన విషయం ఉందని ఐదులక్షలు సుపారీ ఇచ్చినట్లుగా ఉందన్నారు.
హత్య చేసేందుకు వచ్చిన వారు సోము, భరత్ అనేవారుగా తెలిసిందన్నారు. కొన్నేళ్ళుగా తమ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలకు షామియానా ఒక్కరే వేస్తారని వారి సప్లయర్స్‌లోనే పనిచేసేందుకు వచ్చిన వారి వెనుక కుట్ర ఉందన్నారు. హత్య చేసేందుకు సుపారీ జరిగిందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నానని, తన తండ్రి మంత్రి రాజణ్ణ హనీట్రాప్ విషయమై ఫిర్యాదు చేశానన్నారు. హత్యకు సంబందించిన ఫిర్యాదును తీసుకున్న డీజీపీ అలోక్‌మోహన్ తుమకూరు ఎస్‌పీను కలవాలని సూచించారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
పాస్టర్ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు
మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు
గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..
Read Latest Telangana News and National News