Special Trains: కాచిగూడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు..
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:49 PM
కాచిగూడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత వేసవి సీజన్ నేపధ్యంలో ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా... ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై: ప్రయాణికుల సౌకర్యార్ధం పలు ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
- నెం.07191 కాచిగూడ-మదురై(Kachiguda-Madhurai) స్పెషల్ (సోమవారం) ఏప్రిల్ 7 నుంచి మే 5వ తేది వరకు (5 ట్రిప్పులు), నెం.07192 మదురై-కాచిగూడ (బుధవారం) ఏప్రిల్ 9 నుంచి మే 7వ తేది వరకు (5 ట్రిప్పులు) పొడిగించారు. - 07189 నాందేడ్- ఈరోడ్ (శుక్రవారం) స్పెషల్ ఏప్రిల్ 4 నుంచి మే 2వ తేది వరకు (5 ట్రిప్పులు), నెం.07190 ఈరోడ్-నాందేడ్ (ఆదివారం) స్పెషల్ ఏప్రిల్ 6 నుంచి మే 4వ తేది వరకు (5 ట్రిప్పులు) పొడిగించారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: ‘ఉక్కు మనిషి’కి ప్రతిరూపమే అమిత్ షా
- నెం.07435 కాచిగూడ-నాగర్‌కోయిల్ (శుక్రవారం) స్పెషల్ ఏప్రిల్ 4 నుంచి మే 2వ తేది వరకు (5 ట్రిప్పులు), నెం.07436 నాగర్‌కోయిల్-కాచిగూడ) స్పెషల్ ఏప్రిల్ 6 నుంచి మే 4వ తేది వరకు (5 ట్రిప్పులు) పొడిగించారు. - నెం.07601 చర్లపల్లి-విల్లుపురం(Cherlapalli-Villupuram) (గురువారం) స్పెషల్ ఏప్రిల్ 3 నుంచి మే 1వ తేది వరకు (5 ట్రిప్పులు), నెం.07602 విల్లుపురం-చర్లపల్లి (శుక్రవారం) స్పెషల్ ఏప్రిల్ 4 నుంచి మే 2వ తేది వరకు (5 ట్రిప్పులు) పొడిగించినట్లు, ఈ ప్రత్యేక రైళ్ల సేవల ముందస్తు రిజర్వేషన్ ప్రారంభమైందని దక్షిణ రైల్వే తెలియజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
పాస్టర్ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు
మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు
గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..
Read Latest Telangana News and National News