Maoist Letter: ఆపరేషన్ కగార్... మావోల సంచలన లేఖ
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:19 PM
Maoist Letter: మావోయిస్టు పార్టీ సంచలన లేఖ రాసింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టుల హత్యలను ఖండిస్తూ బంద్‌కు పిలుపునిస్తూ లేఖ విడుదలైంది.

ఛత్తీస్‌ఘడ్, మార్చి 28: ఆపరేషన్ కగార్ (Operation Kagar)పేరుతో మావోయిస్టులను ఏరివేసే పనిలో పడింది కేంద్ర సర్కార్. ఇప్పటికే జరిగిన అనేక ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసింది. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్‌పై మావోయిస్టులు (Maoist Letter) స్పందించారు. మావోల హత్యలను ఖండిస్తూ బీజాపూర్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటి అధికార ప్రతినిధి మోహన్ లేఖను విడుదల చేశారు. కగార్ దాడుల్లో అనేక మంది చనిపోయారని.. కగార్ హింసకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు.
లేఖలో ఏముందంటే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ దాడులతో 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టులు, ఆదివాసీలను కలిపి మొత్తం 78 మందిని హతమార్చారన్నారు. ఈ హత్యలను ఖండిస్తూ ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు లేఖలో తెలిపారు. దండాకారణ్యంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టి ఆదివాసీలను ఖాళీ చేపించడమే కగార్ లక్ష్యమని విమర్శించారు. ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister) దుష్ట పాలనకు, కగార్ హింసాకాండకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నాయన్నారు. అందులో భాగంగానే ఈ కగార్ దాడులను అర్ధం చేసుకోవచ్చన్నారు.
Vamsi Remand: వంశీకి రిమాండ్‌పై కోర్టు నిర్ణయం ఇదీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పధకం ప్రకారం రెండు, మూడు రాష్ట్రాలను సమన్వయం చేస్తూ దాదాపు నాలుగు వేల నుంచి 10 వేల సంఖ్యలో భద్రతా బలగాలను తరలించి అనేక వలయాలుగా చుట్టుముట్టి సంయుక్త దాడులు నిర్వహిస్తున్నారని, దండకారణ్య అటవీ ప్రాంతంలోని ఆదివాసీలను తరలించడమే ఈ దాడుల లక్ష్యమని ఆరోపించారు. ఆదివాసీలకు అండగా నిలిచిన మావోయిస్టులు, విప్లవోద్యమాన్ని నిర్మూలించడం, ఇక్కడి ఖనిజ సంపదలను, అటవీ సంపదలను సామ్రాజ్యవాదులకు దోచిపెట్టడమే కగార్ లక్ష్యమని మండిపడ్డారు. దీన్ని ప్రజలు ఖండించాలని, ఆదివాసీ ప్రజలకు, వారి పోరాటాలకు మద్దతు ఇవ్వాలని లేఖలో కోరారు. అలాగే జనవరి నుంచి ఇప్పటి వరకు ఏయే ప్రాంతాల్లో, ఎప్పుడు ఎన్‌కౌంటర్లు జరిగాయి.. ఎంతమంది చనిపోయారు.. వారి వివరాలను తెలుపుతూ మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటి అధికార ప్రతినిధి మోహన్ లేఖను విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి...
Earthquake: భారీ భూకంపం.. ఒక్కసారిగా రోడ్లపైకి జనాలు..
Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే
Read Latest National News And Telugu News