Bengaluru: మా చేతులు కట్టేశారు..
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:30 PM
సంచలనం కలిగించిన మైసూరు అర్బన్ డవలప్మెంట్(ముడా) స్కాంపై మైసూరు నగరాభివృద్ది ప్రాధికార మాజీ కమిషనర్ డీబి నటేష్‌ను విచారణ జరిపేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లు రద్దుపై హైకోర్టు ఫుల్‌బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ స్కాంలో దాదాపు రూ. 4500 కోట్లు చేతులు మారాయనే విమర్శలు పెద్దఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.

- ముడా కమిషనర్‌కు ఈడీ సమన్ల రద్దుపై సొలిసిటర్ జనరల్ వాదనలు
బెంగళూరు: మైసూరు నగరాభివృద్ది ప్రాధికార మాజీ కమిషనర్ డీబి నటేష్‌ను విచారణ జరిపేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లు రద్దుపై హైకోర్టు ఫుల్‌బెంచ్(High Court Full Bench)ను ఆశ్రయించారు. ఇదే విషయమై గురువారం హైకోర్టు ధర్మాసనం ముందు హాజరైన ఈడీ తరుపు సొలిసిటర్ జనరల్ విచారణ విషయంలో తమ చేతులు కట్టేశారన్నారు. ముడా ఇంటి స్థలాల అవినీతి వివాదంలో నిందితులకు జారీ చేసిన సమన్లను హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం రద్దు చేయడాన్ని ప్రశ్నిస్తూ ఫుల్‌బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Special Trains: కాచిగూడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు..
ఈడీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు గురువారం వాదనలు వినిపించారు. మాజీ కమిషనర్ నటేష్‌కు జారీ చేసిన సమన్లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ కావడంపై తదుపరి కేసులో ప్రధానమైన నిందితురాలు పార్వతికి సమన్లు ఇచ్చేందుకు అవకాశం ఉండదన్నారు. కేసులో తదుపరి విచారణ జరిపే అవకాశమే లేకుండా పోయిందన్నారు. రానున్న రోజుల్లో ఇతర నిందితులు కూడా నటేష్ పొందిన సమన్ల రద్దు అంశంపైనే లబ్దిపొందే అవకాశం ఉంటుందన్నారు. ఇలా ముడా కేసులో విచారణ ముందుకు సాగేందుకు వీలులేకుండా పోతోందన్నారు
ఈ వార్తలు కూడా చదవండి:
ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
పాస్టర్ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు
మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు
గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..
Read Latest Telangana News and National News