Aamir Khan: ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్‌’కు అమీర్‌ఖాన్ ప్రశంసలు

ABN , First Publish Date - 2023-04-26T12:39:30+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు...

Aamir Khan: ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్‌’కు అమీర్‌ఖాన్ ప్రశంసలు
Aamir Khan Praises PM Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు.(Aamir Khan) ‘మన్ కీ బాత్’ నెలవారీ రేడియో కార్యక్రమం 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30వతేదీన ప్రసారం కానున్న సందర్భంగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ప్రధానమంత్రి మోదీని అభినందించారు.(Praises)మన్ కీ బాత్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులతో కనెక్ట్ అయ్యే ముఖ్యమైన కమ్యూనికేషన్ అని అమీర్ ఖాన్ బుధవారం ‘మన్ కీ బాత్ @100' జాతీయ సమావేశం సందర్భంగా అన్నారు.

ఇది కూడా చదవండి : Lay Off: అమెరికన్ 3ఎం కంపెనీలోనూ 6వేల ఉద్యోగాల కోత

గౌరవ అతిథిగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ బుధవారం సమావేశాన్ని ప్రారంభించారు. దేశాధినేత ప్రజలతో సంభాషించే ముఖ్యమైన కార్యక్రమంలో ఆలోచనలు తీసుకోవడం, సూచనలు ఇవ్వడం అని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 2014వ సంవత్సరంలో ప్రధాని అయిన తర్వాత మోదీ నెలవారీ రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Updated Date - 2023-04-26T12:43:17+05:30 IST