Parliament : కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం
ABN , First Publish Date - 2023-08-31T15:44:39+05:30 IST
కేంద్ర ప్రభుత్వం అమృత కాలంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ఐదు సిట్టింగ్స్ ఉంటాయని తెలిపింది. అమృత కాలంలో సత్ఫలితాలిచ్చే చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమృత కాలంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ఐదు సిట్టింగ్స్ ఉంటాయని తెలిపింది. అమృత కాలంలో సత్ఫలితాలిచ్చే చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరుగుతాయని తెలిపారు. 17వ లోక్ సభలో 13వ సెషన్, రాజ్య సభ 261వ సెషన్ జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాల్లో ఐదు సిట్టింగ్స్ ఉంటాయన్నారు. అమృత కాలంలో పార్లమెంటులో సత్ఫలితాలిచ్చే చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నదీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించలేదు. ఈ సమావేశాలు నూతన పార్లమెంటు భవనంలో నిర్వహిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. లోక్ సభ, రాజ్య సభ సంయుక్త సమావేశం కూడా కాకపోవచ్చునని తెలుస్తోంది. అమృత కాలం సంబరాలు, ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత దేశం ఎదగడం గురించి చర్చ జరుగుతుందని కొందరు చెప్తున్నారు. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయా? అని కొందరు ఆలోచిస్తున్నారు. చంద్రయాన్-3 విజయవంతమవడం, ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి చకచకా పావులు కదుపుతుండటం, జీ20 సమావేశాల అనంతరం ఈ ప్రత్యేక సమావేశాలు జరగబోతుండటం ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి :
Rs.10 coins: రూ.10 నాణేలు తిరస్కరించవద్దు...
Adani Group : తాజా ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్.. అవన్నీ పాత పాటలేనన్న పారిశ్రామిక దిగ్గజం..