Poonch terror attack: ఫూంచ్ ఉగ్రదాడిలో చైనా, పాకిస్థాన్ దేశాల పాత్ర?
ABN , First Publish Date - 2023-04-21T11:41:57+05:30 IST
జమ్మూకశ్మీరులోని ఫూంచ్ ఉగ్రదాడిలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి....
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీరులోని ఫూంచ్ ఉగ్రదాడిలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.ఈ ఉగ్ర దాడికి దండుగులు స్టీలు బుల్లెట్లు వాడారని శుక్రవారం వెల్లడైంది. దీంతో ఈ దాడి వెనుక పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనా దేశాల హస్తముందని భారత ఆర్మీ భావిస్తోంది. నిన్న జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పూంచ్‌లోని భింబర్ గలి వద్ద బాంబు నిర్వీర్య దళం, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పోలీసులు సంఘటనా స్థలంలో శోధిస్తున్నారు.
తీవ్రవాదుల జాడ కోసం భారత జవాన్లు గాలింపులో భాగంగా డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నారు.ఐదుగురు జవాన్లను హతమార్చిన ఉగ్రవాదుల జాడ కోసం శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌లోని బటా-డోరియా ప్రాంతంలోని అడవుల్లో శోధిస్తున్నారు.మూడు వైపుల నుంచి కాల్పులు జరిగాయి, తర్వాత గ్రెనేడ్ దాడి జరిగింది. ఇంధన ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.