Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం...డాక్టర్ దంపతులతో సహా ఆరుగురి మృతి
ABN , First Publish Date - 2023-01-28T10:36:14+05:30 IST
ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో డాక్టర్ దంపతులతో కలిసి ఆరుగురు మరణించిన దుర్ఘటన...

ధన్‌బాద్ (జార్ఖండ్): ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో డాక్టర్ దంపతులతో కలిసి ఆరుగురు మరణించిన దుర్ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది.(Fire Accident) ధన్‌బాద్(Dhanbad) నగరం పురానాబజార్ లోని హాజ్రా ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం(Massive Fire) జరిగింది. అగ్నికీలలతో పొగ కమ్ముకోవడంతో ఇద్దరు డాక్టర్లతో(Doctor couple) కలిసి మొత్తం ఆరుగురు మరణించారు. అగ్నిప్రమాదం జరిగినపుడు ఆసుపత్రిలో ఉన్న మరో 9 మందిని స్థానికులు కాపాడారు. ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో డాక్టర్ వికాస్ హాజ్రా, అతని భార్య ప్రేమ హాజ్రా, ఇతర ఆసుపత్రి ఉద్యోగులు నలుగురు మరణించారు.
ఆసుపత్రి రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్నిప్రమాదం మొదటి అంతస్తుకు వ్యాపించింది. నిద్రలో ఉన్న వారు ఈ అగ్నిప్రమాదం నుంచి బయటపడలేదు. ఆసుపత్రిలో ఉన్న మరో 9 మందిని పాటలీపుత్ర నర్సింగ్ హోంకు తరలించారు.ఆసుపత్రిలో అగ్నిమాపక సాధనాలు లేవని, సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. రెండు అగ్నిమాపక వాహనాలు వచ్చి ఆసుపత్రిలో రాజుకున్న మంటలను ఆర్పారు.