Fly over: అన్నా ఫ్లై ఓవర్ ఆధునీకరణ పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2023-01-12T10:29:17+05:30 IST
స్థానిక జెమిని సర్కిల్‌లోని అన్నా ఫ్లై ఓవర్(Anna fly over) ఆధునీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 50 ఏళ్ల కిత్రం నిర్మించిన

పెరంబూర్(చెన్నై), జనవరి 11: స్థానిక జెమిని సర్కిల్‌లోని అన్నా ఫ్లై ఓవర్(Anna fly over) ఆధునీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 50 ఏళ్ల కిత్రం నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ నగరంలో మొట్టమొదటి ఫ్లై ఓవర్‌గా పేరుగాంచింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫ్లై ఓవర్‌కు 1971లో శంకుస్థాపన చేయగా, పనులు పూర్తయి 1973 జనవరి 1వ తేది ఆయనే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫ్లై ఓవర్‌ను రూ.8.85 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. విద్యుద్దీపాలు, 6 అడుగుల ఎత్తున సింహం ప్రతిరూపం సహా పలు అంశాలతో చేపట్టిన ఆధునీకరణ పనులు మార్చి నెలాఖరుకు ముగుస్తాయని అధికారులు తెలిపారు.