Governor: ఆ పథకాన్ని గృహిణులందరికీ వర్తింపజేయాలి | Governor: That scheme should be applied to all housewives ksv

Governor: ఆ పథకాన్ని గృహిణులందరికీ వర్తింపజేయాలి

ABN , First Publish Date - 2023-09-16T11:06:59+05:30 IST

తమిళనాడులో గృహిణులందరికి రూ.1,000 పథకం అమలుపరచాలని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై(Puducherry Lieutenant Governor Tamilisai)

Governor: ఆ పథకాన్ని గృహిణులందరికీ వర్తింపజేయాలి

ప్యారీస్‌(చెన్నై): తమిళనాడులో గృహిణులందరికి రూ.1,000 పథకం అమలుపరచాలని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై(Puducherry Lieutenant Governor Tamilisai) అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రంలో రూ.1,000 పథకం కింద లబ్దిపొందే సోదరీమణులు గర్హించదగ్గ విధంగా, దూరదృష్టితో ఆరోజే జన్‌ధన్‌ బ్యాంక్‌ ఖాతాను ప్రధాని నరేంద్ర మోదీ పరిచయం చేశారని, ఆ ఖాతా కలిగిన పేద, మధ్యతరగతి కుటుంబాల మహిళలు నేడు లబ్దిపొందుతున్నారని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల రాయితీలు నేరుగా మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం గృహిణులందరికీ రూ.1,000 పథకాన్ని వర్తింపజేయాలని తమిళిసై కోరారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-09-16T11:06:59+05:30 IST