Share News

Supreme Court: ఎన్నికల నిబంధనల్లో మార్పులపై సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్

ABN , Publish Date - Dec 24 , 2024 | 04:58 PM

ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పు చేస్తూ ఎన్నికల కమిషన్ ఇటీవల చేసిన సవరణలను కాంగ్రెస్ ఆ పిటిషన్‌లో సవాలు చేసింది. ఇందువల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగవచ్చని పేర్కొంది.

Supreme Court: ఎన్నికల నిబంధనల్లో మార్పులపై సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లో మార్పులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేసింది. ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పు చేస్తూ ఎన్నికల కమిషన్ ఇటీవల చేసిన సవరణలను కాంగ్రెస్ ఆ పిటిషన్‌లో సవాలు చేసింది. ఇందువల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగవచ్చని పేర్కొంది.

Amit shah on Ambedkar Remarks: మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు బాహాబాహీ


ఎన్నికలకు సంబంధించి ఎలక్ర్టానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసుకునేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఇటీవల మార్పులు చేసింది. ఈసీ సిఫారసు మేరకు కేంద్ర న్యాయశాఖ ఈ మార్పులను ఆమోదించింది. మార్పు చేసిన నిబంధనల ప్రకారం పోలింగ్‌కు సంబంధించిన సిసీ టీవీ పుటేజ్, వెబ్‌కాస్టింగ్ రికార్డులు, అభ్యర్థులు మాట్లాడిన వీడియో రికార్డులను తనిఖీ చేయడాన్ని నిషేధించారు. ఇందుకోసం ఎన్నికల నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను న్యాయశాఖ సవరించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందువల్ల ఎన్నికల సమగ్రతకు భంగం కలుగుతుందని, ఒక క్రమపద్ధతిలో ఈసీని నిర్వీర్వం చేసేందుకు కేంద్రం పన్నిన కుట్రలో ఇదొక భాగమని ఆయన విమర్శించారు. ఎన్నికల అవకతవకలు, ఈవీఎంల నిర్వహణలోపాలపై తాము ఎన్నిసార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా బేఖాతరు చేసిందని, ఇప్పుడు మరో నిబంధనతో ఎన్నికల సంఘాన్ని నిర్వీరం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ తమ పోరాటం సాగిస్తుందని చెప్పారు.


ప్రతిపక్షాలతో సంప్రదించరా?: జైరామ్ రమేష్

కాగా, ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో చేసిన మార్పులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు ఏఐసీసీ సెక్రటరీ జైరాం రమేష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. స్వచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్ కు ఉందని, కీలక మార్పులుచేసేటప్పుడు ప్రజలు, ప్రతిపక్షాలతో సంప్రందించకపోవడం ఏమిటని నిలదీశారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతగు గండికొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. దీనికి సుప్రీంకోర్టు అడ్డుకట్టు వేసి ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.


ఇది కూడా చదవండి..

NDA government : గత ఏడాదిన్నరలో..10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం

Chennai: దిండివనం వద్ద పట్టాలపై పగుళ్లు

Delhi Assembly Elctions: సీఎంపై పోటీకి దిగుతున్నదెవరంటే..

For National News And Telugu News

Updated Date - Dec 24 , 2024 | 05:01 PM