IMD: నాలుగురోజులు విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2023-07-13T08:34:45+05:30 IST

ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశో

IMD: నాలుగురోజులు విస్తారంగా వర్షాలు

పెరంబూర్‌(చెన్నై): ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లోని అనేక చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక రాజధాని నగరం చెన్నై(Chennai)లో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన స్వల్పవర్షం కురిసే అవకాశముంది. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 26-27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Updated Date - 2023-07-13T08:34:45+05:30 IST