Mumbai Covid Scam: ఆదిత్యా థాక్రే సన్నిహితుల ఇండ్లలో ఈడీసోదాలు

ABN , First Publish Date - 2023-06-21T14:34:16+05:30 IST

కరోనా సమయంలో జరిగిన ఫీల్డ్ ఆస్పత్రుల స్కామ్‌లో ఐఏఎస్ అధికారి సంజీవ్ జైస్వాల్ఇంటితో సహా శివసేన(యూబీటీ) నేతలు ఆదిత్యా థాక్రే, సంజయ్ రౌత్ సన్నిహితుల ఇండ్లలో ఈడీ సోదాలు నిర్వహించారు.

Mumbai Covid Scam: ఆదిత్యా థాక్రే సన్నిహితుల ఇండ్లలో ఈడీసోదాలు

ముంబై: కరోనా సమయంలో జరిగిన ఫీల్డ్ ఆస్పత్రుల స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైకర్టరేట్(ED) చేపట్టింది. బుధవారం ముంబైలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైకర్టరేట్(ED) అధికారులు సోదాలు నిర్వహించారు. ఫీల్డ్ హాస్పిటల్ స్కామ్(Covid Field Hospital Scam) కేసులో ఓ ఐఏఎస్ అధికారి సంజీవ్ జైస్వాల్(Sanjeev Jaiswal) ఇంటితో సహా ఇద్దరు శివసేన(యూబీటీ) నేతల (Shiv Sena (UBT) leaders) సన్నిహితుల ఇండ్లలోనూ సోదాలు నిర్వహించారు.

శివసేన(యూబీటీ)నేత ఆదిత్యా థాకరే(Aaditya Thackeray) అత్యంత సన్నిహితుడు సూరజ్ చౌహాన్(Suraj Chavan), ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) సన్నిహితుడు సుజిత్ పాట్కర్(Sujit Patkar) ఇళ్లు సహా థానే, నవీ ముంబై పరిసర ప్రాంతాల్లో మొత్తం 15చోట్ల ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. జైశ్వాల్ గతంలో థానే మున్సిపల్ కమిషనర్‌గా, కోవిడ్ సమయంలో BMC అదనపు కమిషనర్‌గా పనిచేశారు. దీంతో ఆయన ఇండ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది.

కాగా.. జనవరిలో BMC కమిషనర్ IS చాహల్ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఫీల్డ్ హాస్పిటల్ కాంట్రాక్ట్ కేటాయింపు ప్రక్రియ సంబంధిత వివరాలను ఇవ్వాలని కోరింది.ఈ కేసులో BMC కమిషనర్ చాహల్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడైన సుజిత్ పాట్కర్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కోవిడ్ సమయంలో హెల్త్ కేర్ ఫీల్డ్‌లో అనుభవం లేని కోవిడ్ ఫీల్డ్ ఆస్పత్రులతో పాట్కర్ ఒప్పందం చేసుకున్నారు.

Updated Date - 2023-06-21T14:35:03+05:30 IST