Parliament Building Inauguration Live Updates : నవ శకం.. నవ భారతం.. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం..
ABN , First Publish Date - 2023-05-28T08:06:11+05:30 IST
సనాతన ధర్మం ఉట్టిపడేలా, అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ (New Parliament Building Inauguration ) కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతోంది..
08:30 am : ముగిసిన ప్రార్థనలు
నూతన పార్లమెంట్ భవనంలో ముగిసిన సర్వమత ధర్మ ప్రార్థనలు
08:25 am : జగన్ హాజరు.. కేసీఆర్ గైర్హాజరు
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్
పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించిన 20 ప్రతిపక్ష పార్టీలు
08:10 am : సర్వమత ప్రార్థనలు
పార్లమెంట్ హాల్‌లో సర్వమత ప్రార్థనలు
ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధాని, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు
08:05 am : సెంగోల్‌కు పూజలు
సెంగోల్‌కు ప్రధాని మోదీ పూజలు, సాష్టాంగ నమస్కారం
పూజల తర్వాత సెంగోల్‌ను మోదీకి అందజేసిన వేద పండితులు
సెంగోల్‌తో వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న ప్రధాని మోదీ
సభలో భాజాభజంత్రీలు, వేదపండితుల ఆశీర్వచనాల మధ్య సెంగోల్ ప్రతిష్ఠించిన మోదీ
08:00 am : కార్మికులకు సత్కారం
పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు మోదీ సత్కారం
కార్మికులను శాలువలతో సత్కరించి జ్ఞాపిక అందజేత
సనాతన ధర్మం ఉట్టిపడేలా, అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ (New Parliament Building Inauguration ) కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం ఈ భవనాన్ని మోదీ.. జాతికి అంకితం చేయనున్నారు. హోమం, పూజా కార్యక్రమాలు ఉదయం 7:15 గంటలకే ప్రారంభమయ్యాయి. స్పీకర్ ఓం బిర్లాతో కలిసి పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ప్రధాని నడిచారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి మొదట మోదీ నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాని పూజలో పాల్గొన్నారు. కాగా.. రూ.970 కోట్ల వ్యయంతో 64,500 చదరపు మీటర్లలో త్రికోణాకారంలో.. అతి తీవ్ర భూకంపాలను సైతం తట్టుకునేలా లోక్‌సభ నెమలి థీమ్, రాజ్యసభ తామరపువ్వు థీమ్‌తో ఈ భవనాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
కార్యక్రమాలు ఇలా..
రెండు సెషన్లుగా ప్రారంభోత్సవ కార్యక్రమం
ఉదయం 7.15 నుంచి 9.30 గంటలకు వరకు మొదటి సెషన్‌లో
ఇందులో కేవలం ప్రధాని మాత్రమే పాల్గొంటారు
8.30 గంటలకు ప్రధాని లోక్‌సభ చాంబర్‌లోకి ప్రవేశం
సరిగ్గా 9 గంటలకు సెంగోల్(రాజదండం)ను స్పీకర్ చాంబర్ సమీపంలో ప్రతిష్ఠ
9.30కు లాబీలో జరిగే ప్రార్థనల్లో పాల్గొననున్న ప్రధాని
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్న రెండో సెషన్
మధ్యాహ్నం 12.10 గంటలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ ప్రసంగం
మధ్యాహ్నం 12.17 గంటలకు పార్లమెంట్ చరిత్రపై 2 లఘుచిత్రాల ప్రదర్శన
మధ్యాహ్నం 12.38 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రసంగం
ఒంటిగంటకు రూ.75ల నాణెం, స్టాంపు విడుదల
మధ్యాహ్నం 1.30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
మధ్యాహ్నం 2 గంటలకు ముగియనున్న వేడుకలు
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు
నూతన పార్లమెంట్‌కు 2020 డిసెంబర్ 10న మోదీ శంకుస్థాపన
64,500 చదరపు మీటర్ల పరిధిలో పార్లమెంట్ భవన నిర్మాణం
1,274 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా పార్లమెంట్ నిర్మాణం
లోక్‌సభలో 888, రాజ్యసభ 384 మంది కూర్చునేలా ఏర్పాట్లు
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా పార్లమెంట్ నిర్మాణం
త్రిభుజాకారంలో నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం
జోన్-5 భూకంపాలను తట్టుకునేలా పార్లమెంట్ భవన నిర్మాణం
పార్లమెంట్ ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మలుగా నామకరణం
ద్వారాల పక్కన భారతీయ చరిత్రను తెలిపే కాంస్య చిత్రాలు ఏర్పాటు
కాగా.. త్రికోణాకారంలో ఉండే కొత్త పార్లమెంట్ భవనానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వీటికి జ్ఞాన ద్వారం, శక్తిద్వారం, కర్మ ద్వారం అని పేర్లు పెట్టారు. దీని నిర్మాణంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పలు రాష్ట్రాలకు ప్రత్యేకమైన నిర్మాణ సామగ్రిని వినియోగించారు. ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ నుంచి ప్రత్యేక కార్పెట్లను తెప్పించారు. కొన్ని చోట్ల ఫ్లోరింగ్‌కు త్రిపుర వెదురు, స్పీకర్ చాంబర్ వద్ద అధికార రాజదండానికి చిహ్నాన్ని తమిళనాడు నుంచి తీసుకువచ్చారు. దర్వాజాలు, కిటికీలు, ఇతర ఇంటీరియర్‌కు ఉపయోగించిన టేకును మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి, ఇసుకరాయి, కేసరియా గ్రీన్‌స్టోన్, పాలరాతిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. కాంస్య పనులను గుజరాత్‌లో చేయించారు.