NIA searches: మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు
ABN , First Publish Date - 2023-02-15T08:43:15+05:30 IST
దేశంలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ...
చెన్నై(తమిళనాడు): దేశంలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)(National Investigation Agency) బుధవారం దాడులు చేసింది.(NIA searches) గత ఏడాది కోయంబత్తూర్, మంగళూరు నగరాల్లో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని(Kerala, Tamil Nadu, Karnataka) 60 ప్రాంతాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లలో(suspected ISIS sympathisers) సోదాలు జరిపారు.
కోయంబత్తూర్ పేలుడులో జమీజా ముబీన్ మరణించడంతో అతనితో సంబంధాలున్న వారిని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ రెండు పేలుడు ఘటనలు ఉగ్రవాదులు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.