విజయ పాల ధర పెంపు!
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:39 AM
విజయ పాల ధరను పెంచుతూ కృష్ణామిల్క్ యూనియన్(విజయా డెయిరీ) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

-7 కేటగిరీల్లో లీటర్‌కు రూ.2 చొప్పున వడ్డన
-హోమోజినైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రం రూ.4 పెంపు
-ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి కొత్త ధరలు
- కృష్ణామిల్క్ యూనియన్ నిర్ణయం!
చిట్టినగర్, మార్చి 29(ఆంధ్రజ్యోతి):
విజయ పాల ధరను పెంచుతూ కృష్ణామిల్క్ యూనియన్(విజయా డెయిరీ) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. విజయ డెయిరీ 7 కేటగిరీల్లో పాలను ఉత్పత్తి చేస్తోంది. గోల్డ్ పాల ధర ప్రస్తుతం లీటరు రూ.74 ఉండగా తాజాగా పెరిగిన ధరతో రూ.76 కానుంది. ఫుల్ క్రీమ్ లీటరు రూ.72 నుంచి 74, స్డాండర్డ్ రూ.62 నుంచి 64, టోన్డ్ పాల ధర రూ.58 నుంచి 60, డబుల్ టోన్డ్ రూ.54 నుంచి 56 పెంచారు. అలాగే హోమోజినైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరు రూ.68 నుంచి 72, టీ మేట్ రూ.68 నుంచి 70 పెరగనుంది. ఆవుపాలు లీటరు రూ.54 నుంచి 56, టోన్డ్ మిల్క్ పెరుగు ప్యాకెట్(450 గ్రాములు) రూ.32 నుంచి 33, టోన్డ్ మిల్క్ పెరుగు ప్యాకెట్ (900గ్రాములు) రూ.62 నుంచి 64 పెంచారు. దేశంలోని అన్ని యూనియన్‌లు ధరలను పెంచాయని, పాల ఉత్పత్తి తగ్గడం, పౌండర్, బటర్ ధరలు పెరగటంతో ధరలు పెంచకతప్పలేదని యాజమాన్యం చెబుతోంది. పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. నెలవారీ పాలకార్డు కొనుగోలు చేసిన వారికి ఏప్రిల్ 8 వరకు పాత ధరలే వర్తిస్తాయని తెలిసింది.