పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:32 AM
ప్రజా సమస్యల పరిష్కర వేదికలో అందిన 22(ఏ) అర్జీలను పరిష్కరించడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు.

పార్వతీపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కర వేదికలో అందిన 22(ఏ) అర్జీలను పరిష్కరించడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌లో అందిన 4 ఫిర్యాదులపై విచారణ చేశారు. జేసీ శోభిక, డీఆర్వో హేమలత, జిల్లా రిజి స్ర్టార్ రామలక్ష్మి, జిల్లా సర్వే భూ రికార్డుల అధికారి లక్ష్మణరావు, తహసీల్దార్ల సమక్షంలో విచారణ చేపట్టి, సమస్యలను పరిష్కరించారు.