Share News

PM Narendra Modi: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆ విషయాలపై చర్చ

ABN , First Publish Date - 2023-11-04T18:43:16+05:30 IST

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సరం పూర్తవ్వడంతో.. ఆయనకు మోదీ అభినందనలు తెలిపారు. అనంతరం పశ్చిమాసియాలో...

PM Narendra Modi: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆ విషయాలపై చర్చ

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సరం పూర్తవ్వడంతో.. ఆయనకు మోదీ అభినందనలు తెలిపారు. అనంతరం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. అలాగే.. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఇతర రంగాలతో పాటు ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై మాట్లాడుకున్నారు.

‘‘శుక్రవారం సాయంత్రం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. ద్వైపాక్షియ సంబంధాలను వ్యూహాత్మకంగా బలోపేతం చేయడంపై చర్చించుకున్నారు. అలాగే.. పశ్చిమాసియలో నెలకొన్న ఉద్రిక్తతలపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం. ఉగ్రవాదం, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, హింస, పౌరుల ప్రాణనష్టంపై ఆందోళన వ్యక్తం చేశాం. ప్రాంతీయ శాంతి, భద్రత, సుస్థిరత, నిరంతర మానవతా సహాయం అవసరంపై పని చేయాలని ఇరువురు అంగీకరించాం’’ అని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ఇదే సమయంలో మోదీ, సునాక్ ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తొలుత హమాస్ మెరుపుదాడి చేయగా.. ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారంగా గాజాపై విరుచుకుపడుతోంది. హమాస్‌ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. దీంతో.. గాజాలోని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలపై ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపాల్సిందిగా ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఇదే సమయంలో.. గాజాకు వీలైనంత మానవతా సహాయం అందిస్తున్నాయి.

Updated Date - 2023-11-04T18:43:17+05:30 IST