Farooq Abdullah: రాముడిపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-03-24T07:45:36+05:30 IST
రాముడిపై జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు....
జమ్మూ: రాముడిపై జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.(Farooq Abdullah) అధికారంలోకి వచ్చేందుకు రాముడి పేరును మాత్రమే బీజేపీ ఉపయోగిస్తుందని, అయితే రాముడు హిందువుల దేవుడు మాత్రమే కాదని ఫరూఖ్ వ్యాఖ్యానించారు.రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదని(Ram Is Not God Of Hindus Only), అందరికీ దేవుడని (But Of Everyone)ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. బీజేపీ నేతలకు రాముడిపై ప్రేమ లేదు, అధికారంపై వారికి ప్రేమ ఉందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
ఇది కూడా చదవండి : Dhanbad: ఇంట్లోకి దూసుకెళ్లిన గ్లైడర్ విమానం...పైలట్, చిన్నారికి గాయాలు
భగవాన్ రామ్ ప్రతి ఒక్కరికీ దేవుడని, అది ముస్లిం లేదా క్రిస్టియన్ లేదా అమెరికన్ లేదా రష్యన్ కు అయినా, రాముడిపై విశ్వాసం ఉందని ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు.జమ్మూకశ్మీరులో ఎన్నికలు ప్రకటించినపుడు సామాన్యుల దృష్టి మరల్చడానికి రామమందిరాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.బీజేపీయేతర పార్టీల మధ్య ఐక్యతకు ఎలాంటి అడ్డంకులు లేవని అబ్దుల్లా చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల గురించి ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, వాటి వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.