Share News

Deep Fake: కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటూ రతన్ టాటా చెబుతున్న డీప్ ఫేక్ వీడియో వైరల్..

ABN , First Publish Date - 2023-12-07T10:11:05+05:30 IST

రతన్ టాటాకు చెందిన ఓ ఇన్ స్టాగ్రామ్ వీడియో ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(Ratan Tata)కు చెందిన ఓ డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Deep Fake: కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటూ రతన్ టాటా చెబుతున్న డీప్ ఫేక్ వీడియో వైరల్..

ఢిల్లీ: డీప్ ఫేక్ బాధిత సెలబ్రెటీల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న నటి రష్మిక మందన్న(Rashmika Mandanna)కు సంబంధించిన ఓ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ గా మారిన విషయం విదితమే. డీప్ ఫేక్ పై దేశ వ్యాప్తంగా చాలా మంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ టైంలో రతన్ టాటాకు చెందిన ఓ ఇన్ స్టాగ్రామ్ వీడియో ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(Ratan Tata)కు చెందిన ఓ డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇందులో ఆయన పెట్టుబడికి సంబంధించిన కామెంట్స్ చేస్తూ కనిపిస్తారు. సోనా అగర్వాల్ అనే వ్యక్తి రతన్ టాటాను ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా ఫేక్ వీడియో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశాడు.


సోనాను రతన్ తన మేనేజర్ గా పరిచయం చేస్తాడు. అనంతరం మాట్లాడుతూ.. "దేశ ప్రజలకు ఇదే నా సిఫార్సు. 100 శాతం గ్యారెంటీతో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి అవకాశం. ఇందుకోసం ఈ ఛానెల్ లోకి వెళ్లండి" అని వీడియోలో ఉంది. కొందరు పెట్టుబడి పెట్టి డబ్బులు తీసుకుంటున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది.

దీనిపై స్పందించిన రతన్ టాటా.. ఇదంతా ఫేక్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా డీప్ ఫేక్(Deep Fake) సంబంధించి ఆందోళనలు ఎదురవుతున్న తరుణంలో కేంద్రం దీనిపై సీరియస్ గా తీసుకుంది. తాజాగాకేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా ప్రతనిధులతో భేటీ అయ్యారు. డీప్ ఫేక్ ని ఎలా అరికట్టాలనే విషయంలో చర్చించారు.

Updated Date - 2023-12-07T10:13:39+05:30 IST